ప్రముఖ గాయని, పద్మభూషణ్ వాణీ జయరామ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

CM KCR Expressed his Condolences on the Demise of Veteran Singer, Padma Bhushan Recipient Vani Jayaram, Mango News, Mango News, CM KCR Condolences on Demise of Veteran Singer Vani Jayaram, Padma Bhushan Awardee Vani Jairam Passes Away, Mango News, Mango News Telugu,Veteran playback singer Vani Jayaram, Veteran playback singer Vani Jairam passes away at 78, RIP Legendary singer Vani Jairam, RIP Vani Jairam, vani jairam passed away, vani jairam husband, vani jayaram daughter, vani jayaram age, Vani Jairam Latest News

ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ వాణీ జయరామ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు. 14 భాషల్లో వేయికిపైగా సినిమాల్లో 20 వేలకు పైగా పాటలు పాడిన వాణీ జయరాం సినీ రంగానికి అందించిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఆమె మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటని సీఎం కేసీఆర్ అన్నారు. వాణీ జయరాం కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

గాయని వాణీ జయరామ్ శనివారం మధ్యాహ్నం చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతం హాడోస్ రోడ్‌లోని తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆమె వయస్సు 78 సంవత్సరాలు. వాణీ జయరామ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, భోజ్‌పురి, తుళు మరియు ఒరియా తదితర భాషల్లో 10 వేలకుపైగా పాటలు ఆలపించారు. ఆర్ట్/సినిమా రంగంలో ఆమె సేవలకు గానూ కేంద్రం ప్రభుత్వం ఇటీవలే ఆమెకు భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ భూషణ్‌‘ అవార్డు ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =