ఏపీలో నాలుగు నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం

4 Candidates to Governor for the MLC Posts under Governor Quota, 4 Nominated MLC Posts, AP Governor Biswabhusan Harichandan Gives, AP Governor Biswabhusan Harichandan Gives Approval For 4 Nominated MLC Posts, AP Govt Referred 4 Candidates to Governor for the MLC Posts, AP MLC Posts under Governor Quota, Approval For 4 Nominated MLC Posts, Mango News, MLC Posts, MLC Posts under Governor Quota, MLC Posts under Governor Quota In AP

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో గవర్నర్‌ కోటాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 11 తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్థానాలను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరిచందన్ వద్దకు దస్త్రాన్ని పంపించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతిపాదించిన 4 నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం నాడు ఆమోదం తెలిపారు. ఎమ్మెల్సీల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వారిలో తూర్పుగోదావరి జిల్లా నుంచి తోట త్రిమూర్తులు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేను రాజు, కడప జిల్లాకు చెందిన ఆర్వీ రమేశ్‌ యాదవ్‌, గుంటూరు నుంచి లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. గవర్నర్ ఆమోదంతో ఈ నలుగురు ఎమ్మెల్సీలుగా ఎన్నికయినట్లవగా, త్వరలోనే ప్రమాణస్వీకారం చేసి పదవులు చేపట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here