కరోనాతో మరణించిన వైద్యులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

Andhra Pradesh Government, AP CM YS Jagan, AP government, AP Government Announces Ex Gratia To COVID-19 Frontline Workers, AP Government Announces Ex Gratia To COVID-19 Frontline Workers Who Died On Duty, Central Government, Chief Minister of Andhra Pradesh, Coronavirus, Ex Gratia To COVID-19 Frontline Workers, Ex Gratia To COVID-19 Frontline Workers Who Died, Ex Gratia To COVID-19 Frontline Workers Who Died On Duty, exgratia to the medical staff who died, Mango News, Prime Minister’s Garib Kalyan scheme, Yuvajana Sramika Rythu Congress Party

రాష్ట్రంలో కరోనాతో మరణించిన వైద్యులు, సిబ్బందికి ఆర్థిక భరోసా విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో మరణించిన వైద్యులకు భారీగా ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్‌ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. విధినిర్వహణలో భాగంగా కరోనాతో మరణించిన వైద్యులకు రూ.25 లక్షలు, స్టాఫ్‌ నర్సులకు రూ.20 లక్షలు, ఎంఎస్ఓ, ఎఫ్‌ఎస్ఓ ల‌కు రూ.15 ల‌క్ష‌లు, అలాగే ఇతర వైద్య సిబ్బందికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను అందించనున్నట్టు ప్రకటించారు.

సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించి మరణించిన వైద్యుల కుటుంబీకులకు తక్షణమే ఎక్స్ గ్రేషియా అందించేందుకు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక కేంద్రప్రభుత్వం చెల్లించే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ముందుగా కరోనాతో మరణించిన వైద్యులకు ఎక్స్ గ్రేషియా చెల్లించే విషయంపై ఇటీవలే జూనియర్‌ డాక్టర్లు ఏపీ ప్రభుత్వం ముందు తమ డిమాండ్‌ ను ఉంచారు. అనంతరం ఏపీ వైద్యారోగ్య శాఖ ఈ డిమాండ్ ను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళింది. సీఎం వైఎస్ జగన్ ఆమోదం నేపథ్యంలో ఎక్స్‌గ్రేషియాను నిర్ణయిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 5 =