బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్

Bharatiya Janata Party, Eatala Rajender, Eatala Rajender Join BJP, Eatala Rajender Of TRS Join BJP, Eatala Rajender Of TRS Join BJP Today, Eatala Rajender Join BJP, Etala in Delhi ,BJP , etala rajender, Etela Rajender ,Delhi, Ex Minister Etala Rajender, Former Health Minister of Telangana, former Telangana Health Minister, Former Telangana minister Etela Rajender, Former Telangana minister Etela Rajender join BJP, Health Minister of Telangana, Huzurabad constituency, Mango News, National President of the BJP

ప్రముఖ తెలంగాణ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం నాడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ సమక్షంలో మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరి, కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఈటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్టీ ప్రాథమిక సభ్యతాన్ని అందించారు. ఈటలతో పాటుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తులా ఉమ, ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామరెడ్డి సహా పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీనేత మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here