ఏపీ గవర్నర్‌ కీలక నిర్ణయం.. అర్హులైన పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఆమోదం

AP Governor Biswabhusan Harichandan Issues Notification to Allocating Lands for Poor People in Amaravati, AP Governor Biswabhusan Harichandan, Biswabhusan Harichandan Issues Notification, Allocating Lands for Poor People in Amaravati, Mango News, Mango News Telugu, Ys Jagan To Visit Avanigadda Tomorrow, Complete E-crop Validation In 3 Days, Complete E-crop Validation, Avanigadda E-crop Validation, CM Tour Of Avanigadda Postponed, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Latest News And Updates, Avanigadda AP CM Tour

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్‌ రీజియన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టాల సవరణకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీనికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం ఇలా పేదలకు కూడా రాజధాని ప్రాంతంలో ఇళ్ళు కేటాయిచేలా గతకొన్ని రోజుల క్రితం ఒక కీలక చట్ట సవరణ చేసింది.

దీనిప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న గృహ నిర్మాణ పథకాలు కేవలం ఒక్క రాజధాని ప్రాంతంలోని వారికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర జిల్లాల్లోని అర్హులైన వారికి కూడా అందించే వీలుంటుంది. అలాగే దీనిలో సంబంధిత పాలకవర్గంతో పాటు ప్రత్యేకాధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్టాన్ని సవరించింది. అంతేకాకుండా మాస్టర్‌ ప్లాన్‌లో అవసరానికి అనుగుణంగా ఏవైనా మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు. వీటన్నింటిని పరిశీలించిన గవర్నర్ తాజాగా ఆమోద ముద్ర వేశారు. ఇక గవర్నర్ నిర్ణయంతో ఏపీలోని అర్హులైన పేదలకు రాజధానిలో కూడా ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు మార్గం సుగమం అయ్యింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eleven =