సీఎం వైఎస్ జగన్ ను కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

AP chief Minister YS Jagan Mohan Reddy, Central Minister Kishan Reddy Meets CM YS Jagan, Hyderabad, Kishan Reddy Meets CM YS Jagan, Kishan Reddy Meets CM YS Jagan news, Kishan vows to promote Durga temple as top tourist destination, Mango News, Tadepalli Camp Office, Union Minister Kishan Reddy, Union Minister Kishan Reddy Meets CM YS Jagan, Union Minister Kishan Reddy Meets CM YS Jagan At Tadepalli Camp Office, Union Minister Kishan Reddy meets YS Jagan

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి గురువారం నాడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులను సీఎం వైఎస్‌ జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డి సన్మానించారు. కిషన్‌రెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ భేటీలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.

ముందుగా జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా గురువారం ఉదయం కిషన్ రెడ్డి తిరుపతి నుంచి విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్ద కిషన్ రెడ్డికి పూర్ణకుంభంతో, మేళతాళాలతో, మంగళవాయిద్యాలతో ఆలయ అధికారులు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందించారు. అలాగే ఆలయ పాలకవర్గం అమ్మ వారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. మరోవైపు ఏపీ పర్యటన ముగించుకుని కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో జన ఆశీర్వాద్ యాత్ర ప్రారంభించారు. కోదాడ సమీపంలోని నల్లబండగూడెం నుంచి కిషన్ రెడ్డి యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =