జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సీఎం జగన్

CM YS Jagan Sensational Comments on Janasena Chief Pawan Kalyan, CM Jagan Lashed Out at Janasena Chief Pawan Kalyan, Janasena Chief Pawan Kalyan, CM Jagan Comments On Pawan Kalyan, Pawan Kalyan Latest News And Updates, Andhra Pradesh CM Jagan Mohan Reddy, Jagan Reacts On Pawan Kalyan Remarks, Jagan Makes Strong Comments On PK, Pawan Kalyan Comments on YSRCP Leaders, Janasena Chief, Pawan Kalyan Vizag Tour, Pawan Kalyan Janavani Program, Janavani Program, Janavani News And Live Updates, PSPK News And Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఎన్టీఆర్‌ జిల్లా అవనిగడ్డలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సెక్షన్‌-22 ఏ (1) కేటగిరీ కిందకు వచ్చే నిషేధిత భూముల జాబితా నుండి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో తాము 3 రాజధానులు అని అంటున్నామని, అయితే జనసేనాని మాత్రం మంచి జరగాలంటే 3 పెళ్లిళ్లు చేసుకోండని అంటున్నారని తెలిపారు. నాలుగైదేళ్లు కాపురం చేశాక భార్యకు ఎంతో కొంత ఇచ్చి విడాకులు తీసుకోవడం, మళ్ళీ పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెడితే మన వ్యవస్థ ఏం అవుతుందో ఆలోచించాలని ఆయన అన్నారు.

రాజకీయ నాయకులు ఇచ్చే మెసేజ్ ఇదేనా? ఆడవాళ్ల మాన ప్రాణాలు ఏం కావాలి? అని సీఎం జగన్ ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యల పట్ల మహిళలు సిగ్గుపడుతున్నారని, వీధి రౌడీల్లా బూతులు తిడుతూ చెప్పు చూపిస్తున్నారని మండిపడ్డారు. సభ్య సమాజానికి పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇస్తున్నారని, ఇలాంటి విపరీత ధోరణులతో రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? అని జగన్ ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేస్తున్న తనను ఓడించడానికి కొంతమంది ఏకమవుతున్నారని, ఇది మంచికి, మోసానికి జరుగుతున్న యుద్ధమని అన్నారు. ప్రతిపక్షాలు, వారిని సమర్ధించే మీడియా సంస్థలు కలిసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వీటిని ప్రజలెవరూ నమ్మొద్దని ఆయన కోరారు. ఎవరు ఎన్ని చెప్పినా.. ముందు మీ ఇంట్లో వైసీపీ ప్రభుత్వం వల్ల మంచి జరిగిందా లేదా అని ఆలోచించండి, మంచి జరిగితే నాకు తోడుగా నిలబడండి అని సీఎం జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 7 =