పీఎం-కిసాన్ కింద రైతులకు రేపు రూ.17,000 కోట్లు విడుదల చేయనున్న పీఎం మోదీ

Agriculture Infrastructure Fund, PM Kisan, PM Kisan Funds, PM Kisan Funds Released, PM Kisan News, PM Kisan Status, PM Kisan Updates, PM Modi, PM Modi to Launch Agriculture Infrastructure Fund

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 9, ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయ సదుపాయాన్ని ‘ఏగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ రూపంలో ప్రారంభించనున్నారు. అలాగే పీఎం-కిసాన్ లో భాగంగా 8.5 కోట్ల మందికి పైగా రైతులకు ఆరో కిస్తీ కింద 17,000 కోట్ల రూపాయల నిధులను కూడా పీఎం మోదీ విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది రైతులు, సహకార సంఘాలు, పౌరులు ఈ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొననున్నారు.

ఏగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పేరిట లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయ సదుపాయం తాలూకు కేంద్రీయ రంగ పథకాన్ని ఇటీవలే కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పంటకోతల అనంతర నిర్వహణ సంబంధిత మౌలిక సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్ లు, ధాన్యం సేకరణ కేంద్రాలు, ప్రోసెసింగ్ యూనిట్ లు ఏర్పాటు చేయడంలో ఏగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉపయోగించనున్నారు. ఈ పథకం యొక్క లబ్ధిదారులలో రైతులు, పిఎసిఎస్ లు, మార్కెటింగ్ కో-ఆపరేటివ్ సొసైటీలు, ఎఫ్‌పీఓలు, ఎస్‌హెచ్‌జీలు, జాయింట్ లైయబిలిటీ గ్రూపులు (జేఎల్‌జీ), మల్టీపర్సన్ కో-ఆపరేటివ్ సొసైటీలు, స్టార్టప్స్, కేంద్ర/రాష్ట్ర ఏజెన్సీలు, స్థానిక సంస్థలు స్పాన్సర్ చేసే పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు ఉంటాయని చెప్పారు. మరోవైపు 2018 డిసెంబర్ ఒకటో తేదీ నాడు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం-కిసాన్) ద్వారా ఇప్పటికే 9.9 కోట్ల మందికి పైగా రైతులకు 75,000 కోట్ల రూపాయలను నేరుగా సమకూర్చినట్టు తెలిపారు. ఆరో కిస్తీ కింద రేపు రైతులకు పీఎం మోదీ నగదు విడుదల చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here