తొలిసారిగా అధికారికంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు

Andhra Pradesh News, AP Latest News, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, AP State Formation Celebrations, AP State Formation Celebrations 2019, AP State Formation Celebrations Will Be Conducted For Three Days, AP State Formation Day, AP State Formation Day Celebrations, Mango News Telugu, State Formation Celebrations Will Be Conducted For Three Days

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్‌ 1న అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలకు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లపై అత్యంత వైభవంగా నిర్వహించే ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టి పడేలా ప్రతిష్ఠాత్మకంగా వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేడుకలలో మొదటి రోజున హస్తకళలు, చేనేత కళల సంబంధించిన ప్రదర్శనలు ఉంటాయి. అదేవిధంగా రెండో రోజున కూచిపూడి నృత్య ప్రదర్శన, లలిత, జానపద కళల ప్రదర్శనలు, సురభి నాటకాలు ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక మూడవ రోజున తెలుగు సంప్రదాయ ఆహర ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతుంది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here