నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో కీలక భేటీలు

CM Jagan Likely To Meet PM Modi and Union Home Minister Amit Shah in Delhi Today,CM Jagan Likely To Meet PM Modi,Union Home Minister Amit Shah in Delhi,CM Jagan Likely To Meet Amit Shah in Delhi Today,YS Jagan Mohan Reddy to Meet PM Narendra Modi,Mango News,Mango News Telugu,Andhra pradesh Politics,AP CM YS Jagan Mohan Reddy,YSR Party,Andhra pradesh Politics,AP CM Jagan Latest News and Live Updates,Indian Prime Minister Narendra Modi,Union Minister Amit Shah,Andhra pradesh Latest News

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఈరోజు సాయంత్రం గ‌న్న‌వ‌రం నుండి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ల‌నున్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అవనున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో (ఈనెల 16న) ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సీఎం జ‌గ‌న్.. 12 రోజుల వ్యవధిలో మరోసారి వెళ్లనుండటం గమనార్హం. అప్పుడు కూడా ప్ర‌ధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాతోనూ సమావేశమై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇక అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన త‌రువాత‌, సోమవారం రాత్రి సీఎం జ‌గ‌న్ ఏపీ గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌తో స‌మావేశం అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకోవడంపై రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది.

ఇక రెండు రోజుల క్రితం పార్ల‌మెంట్ బడ్జెట్ రెండో విడత స‌మావేశాల్లో భాగంగా.. ఏపీకి సంబంధించి రెండు కీల‌క అంశాలు స‌భ‌ ముందుకు వ‌చ్చాయి. అందులో ఒక‌టి ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం కాగా.. రెండోది పోల‌వ‌రం ఎత్తుకు సంబంధించిన అంశం. అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పిన కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. అలాగే పోల‌వ‌రం ఎత్తుపై కూడా కేంద్రం స్పష్టమైన ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మరోసారి ఈ అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించనున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో సీఎం జ‌గ‌న్ నేటి రాత్రికి అమిత్‌ షాను క‌లిసే అవ‌కాశం ఉందని, అలాగే శుక్ర‌వారం ప్ర‌ధాని మోదీతో భేటీ అవనున్నారని సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here