టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Chandrababu Nara Lokesh Congratulates Telugu People on the Occasion of TDP Formation Day,Chandrababu Nara Lokesh Congratulates Telugu People,Occasion of TDP Formation Day,TDP Formation Day,Mango News,Mango News Telugu,Nara Lokesh Congratulates Telugu People,TDP Formation Day Latest News,TDP Formation Day Latest Updates,Telugu Desam Party,Andhra pradesh Politics,Andhra Pradesh News and Live Updates,TDP Party Latest News

ఆత్మగౌరవ నినాదంతో పుట్టి, తెలుగు ప్రజల జీవితాల్లో తెలుగుదేశం పార్టీ వెలుగులు నింపిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు తెలిపారు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవ్వాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేస్తూ, తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వ ప‌తాకంగా, రాజ‌కీయ చైత‌న్యానికి సంకేతంగా, తెలుగుదేశం ఆవిర్భ‌వించి 41 ఏళ్లు. అన్న‌గారి ఆశ‌యాల మేర‌కు అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌గా నిలిచింది ప‌సుపు జెండా. బ‌డుగుబ‌ల‌హీన‌వ‌ర్గాల‌కి భ‌రోసా అయ్యింది. మ‌హిళ‌ల స్వావ‌లంబ‌న‌కి చేయూత‌నందించింది. స‌క‌లరంగాల అభివృద్ధిపైనా టీడీపీ సంత‌కం చెర‌గ‌నిది. దేశంలో ఏ రాజ‌కీయ పార్టీకి లేని ల‌క్ష‌లాది కార్య‌క‌ర్త‌ల సైన్య‌మే తెలుగుదేశం బ‌లం. నంద‌మూరి తార‌క‌రాముని ఆశీస్సులు, చంద్ర‌న్న దిశానిర్దేశంలో ప్ర‌జాసంక్షేమ‌మే ల‌క్ష్యం. రాష్ట్రాల ప్ర‌గ‌తే ధ్యేయంగా ద‌శాబ్దాలుగా సాగుతోంది తెలుగుదేశం ప్ర‌యాణం. నేను తెలుగువాడిన‌ని సంతోషిస్తాను. నేను తెలుగుదేశం వాడిన‌ని గ‌ర్విస్తాను. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా అంద‌రికీ శుభాకాంక్ష‌లు” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here