జమ్మూ-కశ్మీర్‌ బస్సు ప్రమాదంలో ఏపీకి చెందిన ఐటీబీపీ జవాన్‌ వీరమరణం.. సంతాపం తెలిపిన సీఎం జగన్‌

CM YS Jagan Condoles ITBP Jawan Rajasekhar From AP Lost Life in Kashmir Bus Falls into Gorge Incident, ITBP Jawan Rajasekhar Lost Life in Kashmir Bus Falls into Gorge Incident, CM YS Jagan Condoles ITBP Jawan Rajasekhar From AP, ITBP Jawan Rajasekhar, AP CM YS Jagan Mohan Reddy, Kashmir Bus Falls into Gorge Incident, Kashmir Bus Incident, ITBP Jawan, AP CM YS Jagan, ITBP Jawan Rajasekhar News, ITBP Jawan Rajasekhar Latest News And Updates, ITBP Jawan Rajasekhar Live Updates, Mango News, Mango News Telugu,

జమ్ము కశ్మీర్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) జవాన్‌ దేవరింటి రాజశేఖర్‌ వీరమరణం చెందారు. ఐటీబీపీ సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో అదుపు తప్పి క్రిందనున్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు ప్రాణాల కోల్పోగా వారిలో రాజశేఖర్‌ ఒకరు. కాగా రాజశేఖర్‌ మృతితో ఆయన స్వస్థలమైన అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం దేవపట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజశేఖర్ మృతిపట్ల ఆయన తల్లిదండ్రులు చిన్నయ్య, రాములమ్మలకు ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. గత పన్నెండేళ్లుగా ఐటీబీపీలో పనిచేస్తున్నాడు. ఇక రాజశేఖర్‌కు భార్య ప్రమీల, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే రాజశేఖర్ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =