తిరుపతిలో ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్, అగరబత్తుల 2వ యూనిట్‌ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

TTD Chairman YV Subba Reddy Inaugurates Cattle Feed Mixing Plant and Agarbattis 2nd Unit in Tirupati,TTD Chairman YV Subba Reddy,YV Subba Reddy Inaugurates Cattle Feed Mixing Plant,Agarbattis 2nd Unit in Tirupati,TTD chairman inaugurates cattle feed,Mango News,Mango News Telugu,TTD opens second agarbatti manufacturing unit,Start Of Feed Mixing Center In Tirumala,TTD Chairman YV Subba Reddy Latest News,TTD Chairman YV Subba Reddy Latest Updates,Tirupati Latest News

తిరుపతిలోని ఎస్వీ గోశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌, అగర్బత్తీల తయారీ రెండో యూనిట్‌ను ప్రారంభించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, టీటీడీ పాలక మండలి సభ్యులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఫీడ్ మిక్సింగ్ ప్లాటు ద్వారా టీటీడీ అవసరాలైన ఎస్వీ గోశాలతో పాటు సుసంపన్నమైన పోషకాల దాణాను తీర్చడంతో పాటు రోజువారీ అవసరమయ్యే 4వేల లీటర్ల పాలను ఎస్వీ గోశాలలోనే ఉత్పత్తి చేసుకునే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. పాల ఉత్పత్తిని 10-15 శాతం పెంచడానికి అవసరమైన చర్యలను చేపడుతున్నామని, దీనిలో భాగంగా శ్రీవారి ఆలయంతో పాటు, తిరుమల, తిరుపతిలోని అనుబంధ ఆలయాల నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే స్వచ్ఛమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, సొంతంగా తయారు చేసుకోవాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించిందని చెప్పారు.

దీని కోసం దేశవాళీ గోవుల పెంపకం, దేశవాళీ గో జాతులను అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు తయారుచేసి వాటిని అమలు చేస్తున్నామని వివరించారు. దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేయడానికి దాతల సహకారంతో 500 దేశవాళీ గోవులను సమీకరించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి ఇప్పటి వరకు 120కి పైగా గిర్, కాంక్రీజ్ దేశవాళీ జాతుల గోవులను తీసుకువచ్చామని వెల్లడించారు. ఇక గోశాల లోని పశువుల దాణా కోసం ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయం నాణ్యమైన ఫీడ్‌ను ఉత్పత్తి చేయడానికి అమెరికాకు చెందిన న్యూ టెక్ బయోసైన్సెస్‌తో మూడు రకాల ఫార్ములాలతో కల్తీ లేని నాణ్యమైన పశువుల దాణా సొంతంగా తయారు చేసుకోవడానికి ఎంవోయూ కుదుర్చుకున్నామని తెలిపారు. అందుకు అనుగుణంగా ఎస్వీ గోశాలలో రూ.11 కోట్లతో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు శామని, అలాగే ఒక దాత ఒకరు రూ. 2కోట్లు విరాళం అందించారని చెప్పారు.

అలాగే యాత్రికుల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మరియు ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అగర్బత్తీల తయారీలో రెండవ యూనిట్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. కాగా బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి టీటీడీ 2021లో అగరబత్తీల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసిందని, ఇప్పటివరకు రూ. 30.66 కోట్ల విలువైన ఉత్పత్తులను భక్తులకు విక్రయించామని తెలిపారు. టీటీడీ దేవాలయాల నుంచి వాడే పూలతో తయారు చేసే ఈ అగరబత్తీలకు యాత్రికుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉన్నందున, ఉత్పత్తిని పెంచి, మొదటి యూనిట్ పక్కనే రెండో యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొదటి యూనిట్‌లో ప్రస్తుతం ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 15,000 ప్యాకెట్లుగా ఉందని, రెండో యూనిట్‌ను ప్రారంభించడంతో ఉత్పత్తి రెట్టింపు అవుతుందని చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + ten =