కొత్త బార్ పాలసీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, మళ్ళీ 840 బార్లకే లైసెన్స్‌లు

AP Govt Announces New Bar Policy-2022 Come into Force from September 1st 2022, Govt Announces New Bar Policy-2022 Come into Force from September 1st 2022, Andhra Pradesh Govt Announces New Bar Policy-2022 Come into Force from September 1st 2022, New Bar Policy-2022 Come into Force from September 1st 2022, September 1st 2022, New Bar Policy-2022, 2022 New Bar Policy, New Bar Policy, Andhra Pradesh Govt, Andhra Pradesh to have new bar policy, New Bar Policy-2022 News, New Bar Policy-2022 Latest News, New Bar Policy-2022 Latest Updates, New Bar Policy-2022 Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 17, శుక్రవారం నాడు రాష్ట్రంలో కొత్త బార్ పాలసీని ప్రకటించింది. కొత్త బార్ పాలసీ-2022 సెప్టెంబర్ 1, 2022 నుంచి అమల్లోకి రానుండగా, లైసెన్స్ లకు మూడేళ్ల పాటుగా అనుమతి ఉండనుంది. కొత్త బార్ పాలసీలో లైసెన్స్‌ ఫీజు మరియు నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ఏడాదికి 10 శాతం మేర పెంచారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 840 బార్లకు మాత్రమే కొత్త లైసెన్స్ లు జారీ కానున్నాయని, కొత్తగా బార్ల సంఖ్య పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఉన్న 840 బార్లు ఒకే చోట కాకుండా కొత్త ప్రదేశాలు/అర్బన్ లోకల్ బాడీస్ లకూ విస్తరించాలని నిర్ణయించారు. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ, ఇతర ప్రాంతాల్లో ఎన్ని బార్లు ఉండాలో ఎప్పటికప్పుడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్‌ నిర్ణయిస్తారని తెలిపారు. లైసెన్స్‌ పొందిన వ్యక్తి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 10 కిమీ, మున్సిపాలిటీలో 3 కిమీ పరిధిలో ఎక్కడైనా బార్‌ పెట్టుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బార్ల లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజు (నాన్ రిపండబుల్) ను 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.5 లక్షలుగా, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.7.5 లక్షలు, ఐదు లక్షలకు పైగా జనాభా ఉంటే రూ.10 లక్షలుగా నిర్ణయించారు. బార్ల కేటాయింపు కోసం వేలం, లాటరీ నిర్వహించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతమున్న బార్ లైసెన్సుల గడువు జూన్ 30 తో ముగియనుంది. అయితే కొత్త లైసెన్స్ ల జారీకి సమయం పట్టనుండడంతో బార్‌ లైసెన్స్ లను మరో రెండు నెలలపాటు అనగా జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + four =