టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఫేక్‌ డిగ్రీ సర్టిఫికెట్‌తో ప్రమోషన్లు పొందారు – మంత్రి కొడాలి నాని

AP News, AP Politics, Ashok Babu, Fake Degree Certificate, Kodali Nani Allegations on TDP MLC, Kodali Nani Allegations on TDP MLC Ashok Babu, Kodali Nani Allegations on TDP MLC Ashok Babu Got Promotion, Mango News, Minister Kodali Nani, Minister Kodali Nani Allegations on TDP MLC Ashok Babu Got Promotion, Minister Kodali Nani Allegations on TDP MLC Ashok Babu Got Promotion With Fake Degree Certificate, TDP MLC Ashok Babu, TDP MLC Ashok Babu Got Promotion With Fake Degree Certificate

టీడీపీ ఎమ్మెల్సీ అకోశ్‌బాబు ఫేక్‌ డిగ్రీ సర్టిఫికెట్‌తో ప్రమోషన్లు పొందారని ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అకోశ్‌బాబు చదివింది ఇంటర్‌ అని, కానీ డిగ్రీ చదివినట్లు దొంగ సర్టిఫికెట్లు పెట్టాడని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఇతరులకి రావాల్సిన ప్రమోషన్లను అకోశ్‌బాబు కొట్టేశారని మంత్రి మండిపడ్డారు. అశోక్‌బాబుపై ఫిర్యాదు చేసింది వైఎస్సార్‌సీపీ కాదని, సాటి ఉద్యోగే అశోక్‌బాబుపై ఫిర్యాదు చేశారన్నారు. అశోక్‌బాబు అరెస్ట్‌పై టీడీపీ గగ్గొలు పెడుతోంది. దీనిలో మా ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. అశోక్‌బాబు కేసును లోకాయుక్త సీఐడీకి అప్పగించింది. తప్పు చేశాడు కాబట్టే సీఐడీ అశోక్‌బాబును అరెస్ట్ చేసింది అని మంత్రి కొడాలి నాని అన్నారు.

చట్టం ముందు.. అశోక్‌బాబైనా, చంద్రబాబైనా ఎవరైనా ఒకటే అని ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. అవినీతి పరుడు కోసం టీడీపీ తాపత్రయపడుతోంది. ఇలాంటివారిని చంద్రబాబు వెనుకేసుకొస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష టీడీపీకి ఆపార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ పై ఎలాంటి ప్రేమ లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆయనను గౌరవిస్తూ కొత్త జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టిందని మంత్రి తెలిపారు. అయితే, టీడీపీ నాయకులు దీనిని కూడా వ్యతిరేకిస్తున్నారని నాని మండిపడ్డారు. హిందూపురం జిల్లా కేంద్రం కావాలట వీళ్ళకి అని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు కొత్త జిల్లాల ఏర్పాటుపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 5 =