విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌ 2023 క్యాంపెయిన్‌ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

World Tourism Day CM YS Jagan Launches Visit Andhra Pradesh 2023 Campaign, CM YS Jagan launched Visit AP 2023 campaign, World Tourism Day , Visit Andhra Pradesh 2023 , Visit Andhra Pradesh 2023 Campaign, Visit Andhra Pradesh, Mango News, Mango News Telugu, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Launches Visit Andhra Pradesh 2023, Visit Andhra Pradesh Launched, AP CM YS Jagan Latest News And Updates, World Tourism Day 2022, World Tourism Day News And Live Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రపంచ పర్యాటక దినోత్సవంను (సెప్టెంబర్ 27) పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్దిలో భాగంగా విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌-2023 క్యాంపెయిన్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. క్యాంపెయిన్‌ బ్రోచర్లను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాదిని విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌-2023గా సీఎం ప్రకటించారు.

రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సులువుగా గుర్తించేలా రూపొందించిన జీఐఎస్‌ వెబ్‌పోర్టల్‌ను కూడా ప్రారంభించారు. అలాగే రాష్ట్రంలోని వైవిధ్య ఉత్సవాల బ్రోచర్లను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరకు నుంచి వచ్చిన గిరిజన థింసా నృత్య కళాకారులతో సీఎం వైఎస్ జగన్ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్‌ డాక్టర్‌ రజత్‌ భార్గవ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − four =