టీడీపీ మహానాడు, చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆర్కే రోజా

Minister RK Roja Sensational Comments on TDP Mahanadu Programme and Chandrababu Naidu, RK Roja Sensational Comments on TDP Mahanadu Programme and Chandrababu Naidu, Minister RK Roja Comments on TDP Mahanadu Programme and Chandrababu Naidu, Minister RK Roja Intresting Comments on TDP Mahanadu Programme and Chandrababu Naidu, Minister RK Roja Sensational Comments on TDP Mahanadu Programme, Minister RK Roja Intresting Comments on Chandrababu Naidu, TDP Mahanadu Programme, Chandrababu Naidu, AP Tourism Minister RK Roja, Minister RK Roja, AP Tourism Minister, RK Roja, TDP Mahanadu Programme Newsx, TDP Mahanadu Programme Latest News, TDP Mahanadu Programme Latest Updates, TDP Mahanadu Programme Live Updates, TDP Mahanadu Programme In Ongole, Mango News, Mango News Telugu,

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోన్న మహానాడు కార్యక్రమం, ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా, దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేశారని.. గతంలోనే ఆయన మామ స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారనిగుర్తు చేశారు. టీడీపీ స్థాపించిన ఎన్టీఆర్ చనిపోవడానికి కారకులైన వారు నేడు ఆయన పేరుతో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఆయన ఫొటోకి దండలు వేసి దండం పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడూ ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా చేయలేదని, కానీ మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్తగా జిల్లా ఏర్పాటు చేసి ఎన్టీఆర్ పేరు పెట్టారని వెల్లడించారు. దీనికి టీడీపీ నాయకులు కనీసం కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదని మండిపడ్డారు. మహానాడులో తాము చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా, సీఎం వైఎస్‌ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాగా ఇటీవల అమలాపురంలో మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని ఖండించారు రోజా. దీనిని అమానుష చర్యగా అభివర్ణించిన ఆమె, అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు శతధా ప్రయత్నించారని ప్రశంసించారు. ఈ అల్లర్లకు పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలేదే లేదు అని స్పష్టం చేశారు మంత్రి రోజా. ఇక మంత్రితో పాటు నగరి నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here