త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ పావులు

Pawan Kalyan,Pawan winning,Pawan implementing, Pawan strategy,TDP, Janasena, Ysrcp,Pawan Kalyan,
Pawan Kalyan,Pawan winning,Pawan implementing, Pawan strategy,TDP, Janasena, Ysrcp,Pawan Kalyan,

ఏపీలో గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తూ దూసుకుపోతున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, కూటమి క్యాండిడేట్ల గెలుపుపై పవన్ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ముఖ్యంగా అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలను పార్టీలోని  కీలక నేతలకు అప్పగించారు.

జనసేనలో టికెట్‌ వివాదాలతో పాటు పార్టీలోని అభ్యర్థుల మధ్య విభేదాలను పరిష్కరించే పనిని నాదెండ్ల మనోహర్‌కు అప్పగించారు. జనసేన-  తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మధ్య విభేదాలను.. పరిష్కరించే  బాధ్యతలను నాగబాబుకు కేటాయించడంతో..ఇద్దరు నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు.

జనసేన పార్టీ టికెట్  ఆశించి.. పొత్తులో భాగంగా ఆ స్థానం టీడీపీకి వెళ్లిన చోట అసంతృప్త నేతలను నాగబాబు  పిలిపించి.. పార్టీ కేంద్ర కార్యాలయంలో వారితో మాట్లాడుతున్నారు . 2,3 రోజులుగా పార్టీ కార్యాలయంలోనే ఉన్న నాగబాబు నియోజకవర్గాలలోని అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. టికెట్‌ దక్కని కొంతమంది నేతలు.. పార్టీ మారడానికి రెడీ అవడంతో  వారిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటి వవరకూ విశాఖ, భీమిలి, తిరుపతి, గుంటూరు, శ్రీకాకుళం, అమలాపురం, పి.గన్నవరం, అనంతపురం నియోజకవర్గ నేతలతో నాగబాబు సమావేశం అయ్యారు. కూటమిలో కలిసి పనిచేసి ఆయా అభ్యర్థులకు సహకరించాలని జనసేన నేతలకు సర్థి చెబుతున్నారు.  అధికారంలోకి వచ్చాక పార్టీ అధిష్టానం సముచిత న్యాయం చేస్తుందని భరోసా ఇస్తున్నారు.

ఇక.. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీలోనే అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో నాదెండ్ల మనోహర్  వారికి నచ్చజెబుతున్నారు. టికెట్‌ దక్కని అసమ్మతి నేతలను దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా..విజయవాడ వెస్ట్‌ జనసేన పార్టీలలో రోజురోజుకీ వివాదం ముదురుతుండడంతో పోతిన మహేష్‌ని పిలిచి మాట్లాడిన మనోహర్.. తర్వాత రామచంద్రపురం జనసేన నేతలతోనూ భేటీ అయ్యారు.

ఇక జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ గెలిచి చూపిస్తామంటున్న జనసేన అధినేత.. ఆ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉభయ గోదావరి జిల్లాలపై మరింతగా ఫోకస్ పెట్టిన పవన్..కూటమి అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. మొత్తంగా  మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తూ ఈ ఎన్నికలను దీటుగా ఎదుర్కోవడానికి పవన్ రెడీ అవుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE