నెగ్గ‌నున్న స్థానిక పోరాటం

A Local Struggle To Rise, Struggle To Rise, Local Struggle, Leader Of Tirupati , Pawan Kalyan , TDP , BJP , Jana Sena, Jana Sena Local Struggle, Latest Jana Sena News, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Leader of Tirupati , Pawan Kalyan , TDP , BJP , Jana Sena

తెలుగుదేశం-బీజేపీతో పొత్తుతో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌న‌సేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధం అవుతోంది. ఇప్ప‌టికే కొన్ని స్థానాల‌ను ప్ర‌క‌టించింది. వాటిలో చిత్తూరు అభ్య‌ర్థిగా ఇటీవ‌ల వైసీపీ నుంచి జ‌న‌సేన‌లో చేరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను అభ్య‌ర్థిగా ఖ‌రారు చేసింది. ఆయ‌న అభ్య‌ర్థిత్వంపై తిరుపతి టీడీపీ, జనసేన నేతలు విముఖంగా ఉన్నారు. అభ్య‌ర్థిని మార్చాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.

దీంతో, అభ్యర్థి మార్పు పైన ఇరు పార్టీల అధిష్ఠానాలు ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచీ జనసేన నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును తిరుపతి జనసేన అభ్యర్థిగా ఖరారు చేయడాన్ని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అభ్యర్థిని మార్చాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఈ నేప‌థ్యంలో తిరుపతి నేతలతో మాట్లాడేందుకు పార్టీ అధికార ప్రతినిధి అజయ్‌కుమార్‌ను ఇటీవల పంపగా.. ఆయన అన్ని వర్గాలతో మాట్లాడి అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు నివేదిక ఇచ్చారు. దీనిపై స్థానిక నేతలతో చర్చించే బాధ్యతను ఆయన తన సోదరుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు అప్పగించారు. నాగబాబు గురువారం 30 మంది తిరుపతి నేతలను పిలిపించి చర్చించారు. వీరిలో మెజారిటీ నాయకులు కచ్చితంగా అభ్యర్థిని మార్చాలని పట్టుబట్టారు. మరోసారి ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేపడతామని.. ఏది ఏమైనా పవన్‌ నిర్ణయించిన అభ్యర్థికి మద్దతిచ్చి గెలిపించాలని నాగబాబు సృష్టం చేశారు. వారి అభిప్రాయాలను జనసేనానికి నివేదించారు. ఇరువురూ చర్చించుకున్నారు.

స్థానిక డిమాండ్లు, తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో తిరుపతి అభ్యర్థి విషయంలో మరోసారి ఫీల్డ్‌ సర్వేతో పాటు ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేయాలని జ‌న‌సేన అధినేత‌ పవన్‌ నిర్ణయించారు. త్వ‌ర‌లోనే ఈతంతు పూర్తిచే  చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఆరణి శ్రీనివాసులును మార్చి స్థానికులకే ప్రాధాన్యమివ్వాలని నాయకత్వం అనుకుంటున్నట్లు సమాచారం. తిరుపతి నుంచి స్థానిక నేతలు డాక్టర్ హారిప్రసాద్ , కిరణ్‌రాయల్‌లు జనసేన సీటు కోసం ప్రయత్నించారు. మరో వైపు టీడీపీ నుంచి ఉకా విజయ్ కూమార్, మాజీ ఎమ్మెల్యే  సుగుణమ్మలు సైతం జనసేనలో చేరి టికెట్ దక్కించుకోవాలని చూశారు. అయితే జనసేనాని ఎవరూ ఉహించని విధంగా ఆర‌ణి శ్రీ‌నివాస్ కు ఇచ్చారు. మార్పు నేప‌థ్యంలో టీడీపీ నేత సుగుణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి అభ్యర్థి స్థానికులై ఉండాలని.. అవసరమైతే జనసేన తరపున తాను పోటీ చేస్తానంటూ సుగుణమ్మ మనసులో మాట బయటపెట్టేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 11 =