ఏపీలో నేడే స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్, ఒక్కరోజే 8 లక్షల మందికి వ్యాక్సిన్!

Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid Vaccination Drive, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Mango News, Special Covid Vaccination Drive, Special Covid Vaccination Drive in AP, Special Covid Vaccination Drive in AP Tomorrow, Special Covid Vaccination Drive in AP Tomorrow Target to Vaccinate 8 Lakh People in Single Day, Vaccine Distribution

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 20, ఆదివారం నాడు స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఆదివారం నాడు ఒక్కరోజే 8 ల‌క్ష‌ల మందికి కరోనా వ్యాక్సిన్ వేసేలా లక్ష్యం పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్యాంపెయిన్ లో 45 ఏళ్లు పైబడిన వారితో పాటు అయిదేళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులకు వ్యాక్సిన్ వేయనున్నారు. ఇప్పటికే ఒకేరోజున 6 లక్షలకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన ఘనతను ఏపీ ప్రభుత్వం దక్కించుకుంది. మరోవైపు జూన్ 18 నాటికీ రాష్ట్ర వ్యాప్తంగా 1,22,83,479 మందికి వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు. ఇందులో 26,41,000 మందికి రెండు డోసులు వ్యాక్సిన్ పూర్తవగా, 71 లక్షల మందికి ఒక డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. అలాగే కరోనా మూడో వేవ్ ను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటికే 5,29,000 మంది అయిదేళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులకు కూడా మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ అందించినట్టు అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − ten =