తెగని విజయవాడ పశ్చిమ సీటు పంచాయితీ

Vijayawada Western Seat Panchayat, Vijayawada Western Seat, Western Seat Vijayawada, Western Seat Panchayat, TDP,Chandra Babu, Kesineni Nani, Budhda Venkanna, Beig, Nagul meera, Latest Vijayawada Western Seat News, Vijayawada, CM Jagan, YCP Party, AP MP Elections, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
TDP, Vijayawada Western seat, Chandra babu, Kesineni Nani, Budhda Venkanna, Beig, Nagul meera

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉన్న ఈ  టైములో.. టీడీపీలో విజయవాడ పశ్చిమ సీటు పంచాయితీ  రోజురోజుకు ముదురుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ సీనియర్  నేతలయిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మధ్య కొనసాగుతున్న విభేదాలతో.. టీడీపీలో వ్యవహారం రచ్చకెక్కుతోంది.

విజయవాడ వెస్ట్ స్థానం నుంచి  ముందు నుంచీ కూడా ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత బరిలోకి దిగుతారనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఈ విషయంపై స్పందించిన కేశినేని  నాని.. విజయవాడ పశ్చిమ నుంచి తాను కానీ తన కుటుంబసభ్యులెవరూ కూడా  పోటీ చేయరని క్లారిటీ ఇచ్చారు. తాము పోటీ చేయం అని చెప్పేంత వరకూ ఓకే కానీ కేశినేని నాని అక్కడితో ఆగలేదు. పశ్చిమ సీటు వివాదానికి ఆజ్యం పోసేలా కామెంట్ చేయడంతోనే ఇప్పుడు విజయవాడ గరంగరంగా మారింది.

విజయవాడ పశ్చిమస్థానం నుంచి బేగ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు బేగ్‌ లాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యే కూడా అవుతారని నాని ధీమా వ్యక్తం చేశారు.  టీడీపీ అధినేత చంద్రబాబు కూడా..యువగళం యాత్ర ముగింపు సందర్భంగా బేగ్‌కు ప్రాధాన్యత ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు.

తనకు అత్యంత సన్నిహితుడైన బేగ్‌కు విజయవాడ వెస్ట్ సీటు ఇప్పించుకోవడానికి కేశినేని నాని ఇలా తన వంతు ప్రయత్నం తాను చేశారు .  అయితే టీడీపీలోని  ఆయన వ్యతిరేకవర్గం ఎప్పటి నుంచో ఈ విషయంలో చాలా అలర్ట్‌గా ఉంది. విజయవాడ వెస్ట్ సీటు కనుక మైనార్టీలకు కేటాయిస్తే అప్పుడు నాగుల్‌ మీరాకు దక్కుతుందని.. బీసీలకు ఇస్తే మాత్రం బుద్దా వెంకన్న బరిలో ఉంటారని నాగుల్ మీరా ఎప్పుడో తేల్చిచెప్పేశారు.

అలాగే మరోవైపు విజయవాడ వెస్ట్  స్థానం రేసులో ఉన్న టీడీపీ కీలక నేత బుద్దా వెంకన్న.. విజయవాడ వెస్ట్ సీటు ఎవరికి దక్కుతుందనే విషయం తమ అధినేత చంద్రబాబు తేలుస్తారని చెప్పుకొచ్చారు. ఈ సీటును తాము ఆశిస్తున్న మాట వాస్తవమే కానీ.. చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని అన్నారు.

దీంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే  ఉండటంతో.. విజయవాడ పశ్చిమ స్థానం పంచాయితీ మరింత ముదిరే అవకాశం ఉందని  టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అధికార వైసీపీని  ఎదుర్కోవడానికి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..పశ్చిమ సీటులో కొనసాగుతున్న సీనియర్ల పంచాయితీకి ఏ రకంగా ముగింపు పలుకుతారో అన్నది ఇప్పుడు బెజవాడలో ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =