ఎపిసోడ్ 12 ( ఆగస్టు 1) హైలైట్స్: మొదటి కెప్టెన్ గా వరుణ్ సందేశ్ ఎంపిక

Akkineni Nagarjuna, Baba Master, Bigg Boss, Bigg Boss Episode 12, Bigg Boss Season 3 Telugu, Bigg Boss Season 3 Telugu Episode 12 Highlights, Bigg Boss Telugu, Bigg Boss Telugu 3, Bigg Boss Telugu 3 Highlights, Bigg Boss Telugu 3 Latest, Hema, Highlights Of Bigg Boss Telugu 3, Highlights Of Bigg Boss Telugu 3 Episode 12, himaja, Jaffar, Mango News Telugu, punarnavi, Rahul, Ravi, Rohini, Sreemukhi, Tammanah Simhadri, Varun Sandesh, Vithika

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. మొదటగా హేమ ఎలిమినేట్ అయ్యింది, తరువాత తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్‌జెండర్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో మళ్ళీ ఇంటిలో 15 మంది సభ్యులు ఉన్నారు. ఆగస్టు 1న ప్రసారమైన బిగ్ బాస్ 3 పన్నెండో ఎపిసోడ్ లో బిగ్ బాస్ పవర్ గేమ్ టాస్క్ఇచ్చారు, తరువాత ఈ టాస్క్ లో కీరిటం గెలుచుకున్న వరుణ్ సందేశ్, అలీరేజా, హిమజలను కెప్టెన్ పోటీదారులుగా ప్రకటించంగా బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్లో మొదటి కెప్టెన్ గా వరుణ్ సందేశ్ ఎంపికయ్యారు.

ఎపిసోడ్ 12 ( ఆగస్టు 1) హైలైట్స్: మొదటి కెప్టెన్ గా వరుణ్ సందేశ్ ఎంపిక

 • వరుణ్ సందేశ్ తనంతటతానే జైలుకెళ్లినా వెళ్లిన విషయంపై హిమజ శివజ్యోతితో మాట్లాడుతుండగా, హిమజను తప్పుబడుతూ వితికా వాదనకు దిగింది
 • తరువాత అక్కడ జరిగిందంతా జైలులో ఉన్న వరుణ్ సందేశ్ కి చెప్పగా, నువ్వు వాళ్లతో ఎలాంటి డిస్కషన్స్ పెట్టవద్దని చెబుతాడు
 • ఇదే విషయంపై అలీరేజా హిమజతో చర్చించే ప్రయత్నం చేయగా, తాను నచ్చకపోతే నామినేట్ చేసుకోమంటూ తనను తప్పుగా చూపించవద్దని హిమజ అలీరేజాతో చెబుతుంది
 • పునర్నవి కూడ ఇదే టాపిక్ లో ఇన్వాల్వ్ అవ్వడంతో, నీకు సంబంధం లేదంటూ హిమజ ఫైర్ అయింది
 • ఫాలో ఫాలో ఫాలోయూ సాంగ్ తో డే మొదలవ్వగా సభ్యులు డాన్స్ చేసారు
 • జైలులో ఉన్న తమన్నా సింహాద్రిని మీరు ఇలా ఎందుకు మారారు అని రాహుల్ అడగగా, తమన్నా సింహాద్రి తన స్టోరీ అంతా వివరంగా చెప్పింది
 • పవర్ గేమ్ టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న వజ్రాన్ని ఎవరు మొదటగా తీసుకుంటే వారే ఇంటికి రాజు అవుతారని చెప్పగా మొదటగా వరుణ్ సందేశ్ వజ్రాన్ని తీసుకుంటాడు
 • ఇంటికి రాజైన వరుణ్ సందేశ్ హిమజతో బట్టలు ఉతికించాడు, మహేష్ శ్రీముఖిలతో బట్టలు మడతపెట్టించాడు మరియు ఇంటి సభ్యులతో డాన్స్ వేయించాడు
 • వరుణ్ సందేశ్ తరువాత వజ్రాన్ని దక్కించుకున్న అలీరేజా ఆడవాళ్ళను మగవాళ్ళుగా, మగాళ్లు ఆడవాళ్ళుగా వేశాలు వేసి అలరించాలని కోరాడు. జాఫర్ చేయనని చెప్పగా, బాబా భాస్కర్ బర్మా బజార్ బేబీ అంటూ సందడి చేసాడు
 • అలీరేజా తమన్నా సింహాద్రికి కూడ పని చెప్పడంతో, తమన్నా తీవ్ర స్థాయిలో అలీరేజా మీద విరుచుకుపడింది, సభ్యులంతా ఎంత చెప్పిన వినకుండా అనేక విధాలుగా అలీరేజాపై ఫైర్ అయింది
 • హిమజ వజ్రాన్ని గెలుచుకుని సభ్యులని తమ గురించి చెప్పమని చెప్పగా, తమన్నా సింహాద్రి తన స్టోరీ చెప్పడంతో ఇంటి సభ్యులు చప్పట్లతో అభినందించారు
 • తరువాత ఈ టాస్క్ లో కీరిటం గెలుచుకున్న వరుణ్ సందేశ్, అలీరేజా, హిమజలను కెప్టెన్ పోటీదారులుగా ప్రకటించారు
 • వరుణ్ సందేశ్ కి,అలీరేజాలకు చెరో ఆరు ఓట్లు రాగా, హిమజకు ఒక్క ఓటు కూడ రాలేదు
 • చివర్లో హిమజ తన ఓటును వరుణ్ సందేశ్ కి వేయగా, హౌజ్ లో మొదటి కెప్టెన్ గా వరుణ్ సందేశ్ ఎంపికయ్యారు
 • తరువాత ఎపిసోడ్ తమ జీవితంలో జరిగిన భావోద్వేగ సంఘటనలను సభ్యులు ఇంటిలో పంచుకోబోతున్నారు, పూర్తి వివరాలకోసం ఈ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here