ఉద్యోగుల జీతాలపై ఏపీ ఆర్థికశాఖ వివరణ

AP Finance Department, AP Finance Department Responded On Salaries, AP Finance Department Responded On Salaries Late, AP Finance Department Responded On Salaries Late Issue, AP Latest News, AP News, Ap Political News, AP Politics, Mango News Telugu, Salaries Issue, Salaries Issue In AP, Salaries Late Issue, YSRCP

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధుల కొరతతో ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు ఆగస్ట్ నెల జీతాలు ఇంకా పడలేదని రెండు రోజుల నుండి సామాజిక మాధ్యమాలు, పలు చానెల్స్ లో ప్రచారమవుతున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికశాఖ ఖండించింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆలస్యంపై వివరణ ఇస్తూ ఆర్థికశాఖ ప్రకటన విడుదల చేసింది. ఎప్పుడు ఇచ్చే విధంగా 1వ తేదీన జీతాలు పడకపోవడానికి నిధుల కొరత కారణం కాదని తెలిపింది. ఉద్యోగుల జీతాల చెల్లింపు మరియు పింఛన్ల చెల్లింపులో సాంకేతిక సమస్య కారణంగానే ఆలస్యం జరిగిందని వివరణ ఇచ్చారు.

సాధారణంగా జీతాల చెల్లింపులు ప్రతినెల 1వ తారీఖున ఆర్బీఐ ఈ-కుభేర్ ద్వారా జరుగుతాయని, ఈనెల కూడ అన్ని జిల్లాల ఉద్యోగులు, పింఛన్ల వివరాలు యధావిధిగా జూలై 31వ తేదీనే ఆర్బీఐ కి పంపించామని ఏపీ ఆర్థికశాఖ తెలిపింది. ఆగస్ట్ 1వ తారీఖు మధ్యాహ్నానికి పింఛన్లు పూర్తిగా చెల్లించామని, కొంతమంది జీతాలు కూడ చెల్లింపు జరిగాయని అయితే కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ-ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్స్ పనిచేయకపోవడం వలన, మిగిలిన ఉద్యోగుల చెల్లింపు విషయంలో ఆలస్యం జరిగిందని చెప్పారు. జీతాల చెల్లింపు పై చర్యలు మొదలయ్యాయని, ఆగస్ట్ 2 శుక్రవారం సాయంత్రం కల్లా అందరికి జీతాలు చెల్లిస్తామని వెల్లడించారు.

 

[subscribe]
[youtube_video videoid=XKqLGQd0a3w]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =