పునీత్ రాజ్‌కుమార్‌కు ‘కర్ణాటక రత్న’ అవార్డు ప్రదానం, హాజరైన ప్రముఖ నటులు రజనీకాంత్, జూ.ఎన్టీఆర్

Actors Rajinikanth and Jr NTR Attends The Ceremony of Karnataka Ratna Felicitation To Late Puneeth Rajkumar in Bengaluru Today, Super Star Rajinikanth, Young Tiger Jr NTR, Karnataka Ratna Felicitation, Late Puneeth Rajkumar, Mango News, Mango News Telugu, Rajinikanth and Jr NTR Attends Karnataka Ratna Felicitation,Karnataka Ratna, Karnataka Ratna Puneeth Rajkumar, Appu Punneth Rajkumar, Appu, Ashwini Revanath

బెంగుళూరులోని విధాన సౌధ/అసెంబ్లీలో కన్నడ రాజ్యోత్సవం భాగంగా ఈరోజు ప్రముఖ దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ అవార్డు ప్రదానం చేసింది. అభిమానులు భారీగా హాజరైన ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్​లుగా సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రత్యేక ఆహ్వానం మేరకు వీరు నేటి వేడుకలో పాల్గొన్నారు. వీరితో పాటు ఈ కార్యక్రమానికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబార్‌, పునీత్ కుటుంబసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక పునీత్ రాజ్ కుమార్ కన్నడ సూపర్ స్టార్ దివంగత రాజ్‌కుమార్ చిన్న కుమారుడు అన్న సంగతి తెలిసిందే. అప్పు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పునీత్ అచిరకాలంలోనే కన్నడనాట అగ్ర హీరోగా ఎదిగాడు.

అయితే గత ఏడాది అక్టోబరు 29న ఆయన హఠాన్మరణంతో దేశవ్యాప్తంగా ఆయనను అభిమానించేవారు షాక్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలో సినీరంగంలో అయన సాధించిన విజయాలకు మరియు అయన చేసిన కృషిని గౌరవిస్తూ పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ పురస్కారం అందజేసింది. ఈ మేరకు సీఎం బొమ్మై అవార్డు జ్ఞాపికను పునీత్ భార్యకు అందజేశారు. దీంతో కర్ణాటకలో విశిష్ట పురస్కారంగా భావించే కర్ణాటక రత్న అవార్డును అందుకున్న 9వ వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ నిలిచ్చారు. మొదటి కర్ణాటక రత్న అవార్డు 1992లో పునీత్ తండ్రి, దిగ్గజ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ కి లభించింది. ఈ సందర్భంగా రజనీకాంత్, జూ.ఎన్టీఆర్ లు పునీత్ రాజ్ కుమార్ తో తమకున్న అనుభవాలను గుర్తుచేసుకున్నారు. దీనికిముందు రజనీకాంత్, జూ.ఎన్టీఆర్ లకు విమానాశ్రయంలో కర్ణాటక ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. ఉన్నత స్థాయి అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి వీరికి స్వాగతం పలికారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 13 =