బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్-2 కన్నుమూత.. సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

Britain Queen Elizabeth II Passes Away President Droupadi Murmu and PM Modi Expresses Condolences, Indian President And Pm Expresses Condolences, Queen Elizabeth Ii Dies Aged 96, Queen Elizabeth Ii Dies At 96, Queen Elizabeth II Passes Away At 96 , Mango News, Mango News Telugu, Queen Elizabeth II Death At 96, Queen Elizabeth II Death Live Updates, Queen Elizabeth II Latest News And Updates, England Queen Queen Elizabeth II, England Queen Dies Aged 96, England Citizens Weep Demise Of Her Queen , Queen Elizabeth II

బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన క్వీన్ ఎలిజ‌బెత్-2 క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా వృద్ధాప్య కార‌ణ అనారోగ్యంతో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధ‌రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు రాజకుటుంబ సభ్యులు, క్వీన్స్ కుమారులు మరియు మనవలు అందరూ స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ కోటకు చేరుకున్న తర్వాత బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారిక ప్రకటన చేసింది. 96 సంవ‌త్స‌రాల క్వీన్ ఎలిజ‌బెత్-2 70 ఏళ్ల పాటు ఇంగ్లండును పాలించటం విశేషం. ఇక ఎలిజబెత్-2 తన తండ్రి కింగ్ జార్జ్-6 మరణం తరువాత ఫిబ్రవరి 6, 1952న తన 25 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్టించింది. ఆమె నవంబర్ 20, 1947న ప్రిన్స్ ఫిలిప్‌ను వివాహం చేసుకుంది. కాగా ఆయన గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. బ్రిట‌న్ రాణి మృతి సందర్భంగా ఆ దేశంలో 10 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు.

ఇప్పుడు క్వీన్ ఎలిజ‌బెత్ తర్వాత ప్రోటోకాల్‌ ప్రకారం ఆమె మొదటి కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ సింహాసనం అధిష్టించనున్నారు. కాగా ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్‌ కింగ్‌ అయినప్పుడు, ఆయన భార్య కెమిల్లా క్వీన్‌ కన్సార్ట్‌ అవుతుందని ఈ ఏడాది ప్రారంభంలో క్వీన్‌ ఎలిజబెత్‌ 2 ప్రకటించారు. కింగ్‌ భార్యను క్వీన్‌ కన్సార్ట్‌గా పేర్కొంటారు. ప్రిన్స్‌ చార్లెస్‌ కింగ్‌ అవ్వడంతో కోహినూర్‌ వజ్రం ఉన్న కిరీటాన్ని క్వీన్ కన్సార్ట్‌గా కెమిల్లా ధరించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూర్ వజ్రం భారతదేశంలో కనుగొనబడింది. అనేక రాజ్యాల చేతులు మారి పంజాబ్‌ మహారాజు రంజిత్‌సింగ్‌ దగ్గరకు చేరింది. అయితే ఆయన మరణానంతరం బ్రిటీష్‌ ప్రభుత్వం చేజిక్కించుకుంది. ఈ క్రమంలో అది రాణి కిరీటంలో పొదగబడింది.

ఇక క్వీన్ ఎలిజ‌బెత్-2 మృతికి అనేక ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు సంతాపం తెలిపారు. ఈ క్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిట‌న్ రాణి మృతికి తమ తీవ్ర సంతాపం తెలియజేశారు. ప్రధాని మోదీ ట్విట్టర్ లో.. 2015 మరియు 2018లో నా యూకే పర్యటన సమయంలో నేను క్వీన్ ఎలిజబెత్ IIతో చిరస్మరణీయమైన సమావేశాలను నిర్వహించాను. ఆమె ఆప్యాయత మరియు దయను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఒక సమావేశంలో మహాత్మా గాంధీ తన వివాహానికి బహుమతిగా ఇచ్చిన రుమాలును నాకు చూపించారు. నేను ఎల్లప్పుడూ ఆమెను గౌరవిస్తాను’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + two =