టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి చిక్కులు.. చెక్ బౌన్స్ కేసులో బీహార్‌లో ఎఫ్ఐఆర్ నమోదు

Case Files Against Former Team India Captain MS Dhoni in a Check Bounce Case at Bihar, Case Files Against Former Team India Captain MS Dhoni, Former Team India Captain MS Dhoni in a Check Bounce Case at Bihar, India Captain MS Dhoni in a Check Bounce Case at Bihar, MS Dhoni in a Check Bounce Case at Bihar, Case against Mahendra Singh Dhoni, Check Bounce Case against Mahendra Singh Dhoni, Mahendra Singh Dhoni, Former Team India Captain MS Dhoni, Former Team India Captain Mahendra Singh Dhoni, EX-Team India Captain Mahendra Singh Dhoni, MS Dhoni Bounce Case, Case Files Against EX-Team India Captain Mahendra Singh Dhoni, MS Dhoni Bounce Case News, MS Dhoni Bounce Case Latest News, MS Dhoni Bounce Case Latest Updates, MS Dhoni Bounce Case Live Updates, Mango News, Mango News Telugu,

టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చిక్కుల్లో పడ్డాడు. ఆయనపై బీహార్ రాష్ట్రంలో ఒక చెక్ బౌన్స్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక ఎరువుల తయారీ సంస్థకు చెందిన కేసులో ఎంఎస్ ధోని అకారణంగా ఇరుకున్నాడని అభిమానులు వాపోతున్నారు. బీహార్‌లోని కోర్టులో రూ. 30 లక్షల చెక్కు బౌన్స్‌కు సంబంధించిన కేసులో ధోనీని నిందితుడిగా చేర్చిన ఫిర్యాదు దాఖలైంది. ఈ కేసులో ధోనీతో పాటు మరో 7 మంది పేర్లను కూడా నిందితుల్లో చేర్చారు.

వివరాల్లోకెళితే.. ఎంఎస్ ధోని టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్న కాలంలో బీహార్‌కు చెందిన ‘గ్లోబల్ అప్‌గ్రేడ్ ఇండియా ‘ అనే కంపెనీకి ప్రధాన ప్రమోటర్ గా ఉన్నాడు. అయితే ఈ సమయంలో డీఎస్ ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ తన ఉత్పత్తులలో ఒకదానిని విక్రయించడానికి ఈ ఎరువుల కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ఉత్పత్తి కోసం డీఎస్ సంస్థ సదరు కంపెనీకి 30 లక్షలు చెల్లించింది. అయితే ఈ ఎరువులలో నాణ్యత లోపం ఉందని, కంపెనీ ఎరువులను ఏజెన్సీకి పంపినా మార్కెటింగ్‌కు సహకరించలేదని, దీంతో ఏజెన్సీలో సరుకులు నిలిచిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ తర్వాత ధోని ప్రమోట్ చేసిన సంస్థ.. ఆ ఎరువులను వెనక్కు తీసుకుని, ఆ సంస్థ చెల్లించిన రూ. 30 లక్షల చెక్కును తిరిగి అందజేసింది. డీఎస్ ఎంటర్‌ప్రైజెస్ ఆ చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది. దీంతో డీఎస్ ఎంటర్‌ప్రైజెస్.. న్యూఇండియా గ్లోబల్ సంస్థ కు ప్రమోటర్ గా ఉన్న ధోనితో పాటు మరో ఏడుగురికి లీగల్ నోటీస్ పంపింది. బీహార్‌లోని బెగుసరాయ్ కన్స్యూమర్స్ కోర్టు ముందుకు వచ్చిన ఈ కేసును జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కు బదిలీ చేశారు. కాగా దీనిపై తదుపరి విచారణ జూన్ 28న జరుగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + twelve =