కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్, లైవ్ అప్‌డేట్స్

Karnataka Assembly Elections CM Bommai and Ex CM's Siddaramaiah Kumaraswamy Cast Their Votes Follow Live Updates,Karnataka Assembly election 2023,CM Bommai Cast Their Vote,Ex CM's Siddaramaiah Kumaraswamy Cast Their Vote,Karnataka Elections 2023 Live,Karnataka Election LIVE,Mango News,Mango News Telugu,Karnataka Assembly Elections voting live updates,Karnataka Election 2023 Live,Karnataka elections,Karnataka Assembly Election,Karnataka Assembly Election 2023,Karnataka Election 2023 Updates,2023 Karnataka Legislative Assembly election,Karnataka Assembly Election 2023 News,Karnataka Assembly Elections voting,Karnataka Election News,Karnataka Election Results,Karnataka Elections Live Updates,Karnataka Election 2023 Live Updates,Karnataka Assembly Election 2023 Live Updates,Karnataka Election Live Updates,Karnataka Elections 2023 LIVE UPDATES,Karnataka Assembly Elections 2023 Polling LIVE Updates,Karnataka Assembly Elections 2023 Polling,BJP Vs Congress Vs JDS,Karnataka Poll

క‌ర్ణాట‌క‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. రాష్ట్రంలోని 224 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒకే విడత‌లో పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 58,545 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తోంది. 224 నియోజ‌క‌వర్గాల‌కు గానూ 2,615 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. ఇక 5,31,33,054 మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో.. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వ‌ర‌కు క్యూలైన్ల‌లో నిల్చున్న వారంద‌రికీ ఓటేసేందుకు అవ‌కాశం ఉంటుందని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. మే 13న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు.

 • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
 • ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ఈ సాయంత్రం 6 గంటలకు పూర్తయింది.
 • చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు ప్రకటించారు.
 • ఇక పోలింగ్ ముగిసిన వెంటనే పేరొందిన వివిధ సర్వే సంస్థలు, ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నాయి.
 • సాయంత్రం 5 గంటల వరకు 65.69 శాతం పోలింగ్ నమోదైంది.
 • ఉదయం 11 గంటల వరకు 20.99 శాతం పోలింగ్ నమోదవగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.03 శాతం పోలింగ్ నమోదైంది.
 • ఇప్పటివరకు ఉడిపి జిల్లాలో అత్యధికంగా 47.79 శాతం పోలింగ్ నమోదైంది.
 • సీఎం బసవరాజ్ బొమ్మై ఆలయానికి వెళ్లి పూజలు చేసిన అనంతరం శింగావ్‌ పోలింగ్ బూత్‌కు చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 • సీఎం బొమ్మై బీజేపీ తరపున శింగావ్‌ నుంచి పోటీ పడుతుండగా.. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్‌ పార్టీ తరపున వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.
 • అలాగే మాజీ సీఎంలు కుమారస్వామి జేడీఎస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెన్నపట్టణలో బరిలోకి దిగగా.. జగదీశ్ శెట్టర్‌ కాంగ్రెస్‌ తరపున హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు.
 • మాజీ ప్ర‌ధాని దేవెగౌడ భార్య చెన్న‌మ్మ‌తో క‌లిసి హ‌స‌న్ జిల్లాలోని స్వ‌గ్రామ‌మైన హ‌ర‌ద‌న‌హ‌ల్లిలో ఓటు వేశారు.
 • మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప కుటుంబ సమేతంగా ఓటు వేశారు.
 • కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.
 • ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి బెంగళూరులో ఓటు వేశారు.
 • కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ జయనగర్‌లోని బీఈఎస్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.
 • మైసూరు రాజమాత ప్రమోదాదేవి వడియార్, బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఓటు వేశారు.
 • కన్నడ నటులు ఉపేంద్ర, రమేష్ అరవింద్ బెంగళూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 • ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ బెంగ‌ళూరు శాంతిన‌గ‌ర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
 • పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోండా పోలీసులు ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.
 • ఎన్నికల బందోబస్తుకు మొత్తం 1.56 లక్షల మంది పోలీసులను, హోంగార్డులను నియమించారు.
 • క‌ర్ణాట‌కకు చెందిన 84,119 మంది పోలీసుల‌తో పాటు 58,500 మంది సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్సెస్‌తో పాటు ఇత‌ర కంపెనీలో బందోబ‌స్తులో ఉన్నాయి.
 • స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌డంతో పాటు సీసీటీవీ కెమెరాల‌ను ఏర్పాటు చేసి నిఘా పెంచారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + one =