దొరికిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ

chandrayaan 2, Chandrayaan 2 ISRO Finds Vikram Tries To Reestablish Communication, Chandrayaan 2 mission is still on, chandrayaan 2 satellite latest news, indian space research organisation, ISRO About Chandrayaan 2 Satellite, ISRO Finds Vikram, ISRO Finds Vikram Tries To Reestablish Communication, ISRO lost communication with Chandrayaan 2 Vikram Lander, ISRO Tries To Reestablish Communication, Mango News Telugu, Vikram lander

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి వరకు సజావుగా సాగి, చివరి క్షణాల్లో చంద్రుని ఉపరితలానికి 2.1 కి.మీ ఎత్తు వరకు వెళ్లిన విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ల్యాండర్ ను చంద్రుని ఉపరితలంపై గుర్తించినట్టు ఇస్రో ఛైర్మన్ కె. శివన్ తెలిపారు. చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవాన్ని తాకిందని, కాకుంటే సున్నితంగా ల్యాండ్ అవ్వకుండా గట్టిగా ఢీకొట్టి ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. ఆర్బిటర్ చంద్రుని ఉపరితలంపై ఉన్న ల్యాండర్ ధర్మల్ ఇమేజ్ ను తీసిందని, అయితే ఇంకా దాని వాస్తవ పరిస్థితులు తెలియాల్సి ఉందని అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల బృందం ల్యాండర్ తో కమ్యూనికేషన్‌ను పునరుద్దించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అయితే ల్యాండర్ కాలపరిమితి ఇంకా 12 రోజులు మాత్రమే ఉండడంతో అప్పటివరకు ల్యాండర్ తో కమ్యూనికేషన్లను పునరుద్ధరణ చేసేందుకు ప్రయత్నిస్తామని, ఆర్బిటర్-ల్యాండర్ మధ్య సమాచార వ్యవస్థను ఏర్పరచాలని ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ఆచూకీ తెలియడంతో చంద్రునిపై చేరిన నాలుగో దేశంగా, చంద్రుని దక్షిణ ధృవంపై దిగిన తొలిదేశంగా భారత్ ఘనత సాధించింది అని, ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేసారు. జరిగిన పరిణామాల తరువాత మోడీ ప్రసంగం, దేశ ప్రజలు అండగా నిలిచిన తీరు శాస్త్రవేత్తలు, ఇంజినీర్లలలో ధైర్యం పెంచిందని కె. శివన్ పేర్కొన్నారు. చంద్రుడిపై ల్యాండర్ ఆచూకి తెలియయడంతో దేశ పౌరులు ఆనందం వ్యక్తం చేసారు. ఇక ఇస్రో బృందం ల్యాండర్ తో కమ్యూనికేషన్ సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here