తెలంగాణ అసెంబ్లీ సెప్టెంబర్ 14కు వాయిదా

Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Assembly Budget Session, Telangana Assembly Budget Session 2019, Telangana Assembly Budget Session 2019-20, Telangana Breaking News, Telangana Budget Assembly Sessions Adjourns, Telangana Budget Assembly Sessions Adjourns To 14th September, Telangana Budget Assembly Sessions Adjourns To September 14th, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మరో వైపు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అయితే తెలంగాణ అసెంబ్లీ శనివారానికి వాయిదా పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభను సెప్టెంబర్ 14వ తేదికు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1,46,492.3 కోట్లతో 2019-20 సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

గడిచిన ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రము అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని చెప్పారు. ఆర్థిక మాంద్యం ఉన్నా కూడ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పధకాలు అలాగే నడిపిస్తామని స్పష్టం చేసారు. పాలమూరు రంగారెడ్డి మరియు సీతారామ ప్రాజెక్టులు యధావిధిగా కొనసాగుతాయని చెప్పారు. అంతే కాకుండా రైతుబంధు పథకం కూడ ఎప్పటిలాగే యధాతధంగా కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. శనివారం నుంచి శాసనసభ, శాసనమండలిలలో బడ్జెట్ పై చర్చించనున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=flXuPvpst9c]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =