బిగ్ బాస్ -3: ఎలిమినేట్ అయినా అలీరేజా, కన్నీరు పెట్టుకున్న ఇంటి సభ్యులు

Alireza Elimated From Bigg Boss Season 3 Telugu, Alireza Evicted From The Show, Bigg Boss Season 3 Telugu, Bigg Boss Season 3 Telugu Highlights, Bigg Boss Season 3 Telugu Latest Updates, Bigg Boss Season 3 Telugu Sunday Episode, Bigg Boss Season 3 Telugu weekend Episodes Highlights, Bigg Boss Telugu 3 Highlights, Bigg Boss Telugu 3 Latest, Bigg Boss Telugu 3- Alireza Evicted From The Show, Highlights Of Bigg Boss Telugu 3, Mango News Telugu

జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక 50వ ఎపిసోడ్ లో అలీరేజా ఎలిమినేట్ అయ్యారు. అసలు ఇంటిలోకి ప్రవేశించాక అలీరేజా నామినేట్ అవ్వడం ఇదే తొలిసారి. అలీరేజా ఎలిమినేట్ అయినట్టు వ్యాఖ్యాత నాగార్జున చెప్పగానే ఇంటిసభ్యులు అందరూ షాక్ కి గురయ్యారు. శివజ్యోతి వెక్కి వెక్కి ఏడ్చింది. శ్రీముఖి అలీకి ఎదురెళ్లి గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. వరుణ్ సందేశ్, రవి కృష్ణ, రాహుల్, బాబాబాస్కర్ ఇలా అందరూ అలీని హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. హిమజ ఇప్పటికి తను నమ్మలేక పోతుందని చెప్పింది. ఇంతమంది తనకోసం బాధపడుతున్నారంటే, టైటిల్ గెలవకపోయిన ఎటువంటి బాధలేదని అలీరేజా చెప్పారు. ఇంటి సభ్యులు అందరు కలిసి అలీకి వీడ్కోలు చెప్పారు.

ఆదివారం నాడు కింగ్ అక్కినేని నాగార్జున తో పాటు, నాని కూడ బిగ్ బాస్ షోలో సందడి చేసారు. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న తన గ్యాంగ్ లీడర్ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నాని మళ్ళీ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులు ఒక్కోక్కరికి తను అనుకున్న పాత్రను ఇచ్చి వారితో కలిసి సందడి చేసాడు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో ఇప్పటికి 50 రోజులు పూర్తయ్యి ఎనిమిదో వారంలోకి ఇంటి సభ్యులు అడుగుపెట్టారు. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి, అలీరేజా ఎలిమినేట్ అవ్వగా ఇంటిలో 11 మంది సభ్యులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here