కామన్వెల్త్‌ గేమ్స్‌-2022: శనివారం ఒక్కరోజే భారత్‌కు 14 పతకాలు, 40కి చేరిన మొత్తం మెడల్స్

Commonwealth Games-2022 India Wins 14 Medals with 4 Gold on Saturday Medal Tally Rises To 40, India Wins 14 Medals with 4 Gold on Saturday Medal Tally Rises To 40, India Wins 14 Medals In Commonwealth Games-2022, India Has 40 Medals In Commonwealth Games-2022, India Wins 14 Medals with 4 Gold on Saturday, CWG-2022, Commonwealth Games-2022, Birmingham Commonwealth Games 2022, 2022 Birmingham Commonwealth Games, Birmingham Commonwealth Games, Commonwealth Games, Birmingham Alexander Stadium, Commonwealth Games 2022 sports, Birmingham Commonwealth Games 2022 News, Birmingham Commonwealth Games 2022 Latest News, Birmingham Commonwealth Games 2022 Latest Updates, Birmingham Commonwealth Games 2022 Live Updates, Mango News, Mango News Telugu,

ఇంగ్లాండ్ బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 లో శనివారం భారత్ అదరగొట్టింది. గేమ్స్‌లో తొమ్మిదవ రోజైన ఆగస్టు 6వ తేదీన 4 స్వర్ణాలతో సహా మొత్తం 14 పతకాలు సాధించింది. పారాలింపిక్‌ సిల్వర్‌ మెడల్‌ విజేత భవీనాబెన్‌ పటేల్‌ కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్ క్లాస్ ఫైనల్‌లో నైజీరియా ప్లేయర్‌ ఇఫెచుక్వుడేపై జరిగిన హోరాహోరీ పోరులో గెలుచి బంగారు పతకం సాధించింది. మరోవైపు పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత రెజ్లర్లు సత్తా చాటారు. వినేశ్‌ ఫోగట్‌, రవి దహియా, నవీన్‌ స్వర్ణాలు దక్కించుకున్నారు. వీరితో పాటు పూజ గెహ్లాట్‌, పూజ సెహాగ్‌, దీపక్‌ నెహ్రా కాంస్యాలు చేజిక్కించుకున్నారు. ఇక కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ 40 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో 13 స్వర్ణాలు, 11 సిల్వర్‌, 16 బ్రోన్జ్‌ మెడల్స్‌ ఉన్నాయి. 155 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్‌ (148), కెనడా (84), న్యూజిల్యాండ్‌ (44) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా పతకాలు దక్కించుకున్న భారత ప్లేయర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.

శనివారం పతకాలు సాధించిన భారత ప్లేయర్స్..
  • నవీన్ (రెజ్లింగ్) – స్వర్ణం
  • రవి దహియా (రెజ్లింగ్) – స్వర్ణం
  • వినేష్ ఫోగట్ (రెజ్లింగ్) – స్వర్ణం
  • భవినాబెన్ పటేల్ (పారా టేబుల్ టెన్నిస్) – స్వర్ణం
  • భారత పురుషుల జట్టు (లాన్ బౌల్స్) – రజతం
  • ప్రియాంక గోస్వామి (మహిళల 10 కి.మీ రేసు నడక) – రజతం
  • అవినాష్ సాబుల్ (పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్) – రజతం
  • దీపక్ నెహ్రా (రెజ్లింగ్) – కాంస్యం
  • పూజా సిహాగ్ (రెజ్లింగ్) – కాంస్యం
  • పూజా గెహ్లాట్ (రెజ్లింగ్) – కాంస్యం
  • రోహిత్ టోకాస్ (బాక్సింగ్) – కాంస్యం
  • జైస్మిన్ లంబోరియా (బాక్సింగ్) – కాంస్యం
  • మహ్మద్ హుసాముద్దీన్ (బాక్సింగ్) – కాంస్యం
  • సోనాల్‌బెన్ పటేల్ (పారా టేబుల్ టెన్నిస్) – కాంస్యం

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 19 =