ప్రభుత్వ ఇంజనీరు పై బురద చల్లిన మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేశ్ రాణే

Congress MLA Nitesh Rane Assault On Govt Engineer,Mango News,Maharashtra Congress MLA Nitesh Rane assaults Govt babu supporters dump mud on engineer,Congress MLA Nitesh Rane arrested for assaulting government official,Congress MLA Nitesh Rane pours mud on govt officer justifies act,Nitesh Rane Latest News,Maharashtra Political News

మహారాష్ట్రలోని కణకావలీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సి) శాసనసభ సభ్యుడు నితేష్ నారాయణ్ రాణే ప్రభుత్వ అధికారిపై దాడి చేశారు. జూలై 4 న, నితేష్ రాణే తన మద్దతుదారులతో కలిసి, కణకావలీ ముంబై-గోవా హైవే సమీపంలో ఉన్న వంతెన వద్ద ప్రభుత్వ హైవే ఇంజనీర్ ప్రకాష్ షెడేకర్ పై రెండు బకెట్ల బురదను పోశారు. జూలై 4 మధ్యాహ్నం నితేష్ రాణే రహదారిని తనిఖీ చేస్తున్నప్పుడు గుంతలు ఎక్కువుగా ఉండడంతో ఆగ్రహం తో అతని అనుచరులతో కలిసి ఇంజనీర్ పై దాడి కి ప్రయత్నించారు .

అనుచరులు ఆ తరువాత, అతన్ని ఒక తాడు సహాయంతో అక్కడి వంతెన కి కట్టడానికి కూడా ప్రయత్నించారు. జరిగిన ఈ సంఘటన పట్ల నితేష్ నారాయణ్ రాణే తండ్రి నారాయణ రాణే క్షమాపణ తెలియజేసారు. ప్రస్తుతం ఆయన బిజెపి పార్టీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు, గతంలో ముఖ్యమంత్రి గా కూడా పనిచేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here