లైవ్ అప్‌డేట్స్ – కేంద్ర బడ్జెట్ 2019-20

Union Budget 2019 -2020,Mango News,Finance Minister Nirmala Sitharaman To Present Budget In Parliament,Mango News,Budget 2019 Live Updates,Cabinet meeting underway to approve Budget document Nirmala Sitharaman speech to start at 11 am,Nirmala Sitharaman To Present 1st Budget Of PM Modi New Government Today,Nirmala Sitharaman to start her speech at 11 am be ready for many surprises,Union Budget 2019-20 Live Updates,Budget 2019 live news updates,Union Budget 2019 LIVE,Union Budget 2019 Highlights,#Budget2019

కేంద్ర బడ్జెట్ 2019-20 – లైవ్ అప్‌డేట్స్

 • చిన్న వ్యాపారులకు 59 నిమిషాల్లో లోన్ అందించే ఏర్పాటు
 • భారత్ మాల ఫేజ్- 2 అన్ని రాష్ట్రాలకు సహకారం
 • డీజిల్, పెట్రోల్ పై రూ. 1 సుంకం పెంపు
 • బంగారం పై కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంపు
 • వ్యక్తిగత ఆదాయం పన్ను విధానం పై ఎటువంటి మార్పు లేదు
 • ఐదు కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉంటే సర్ ఛార్జ్ అమలు
 • పన్ను వసూళ్లు 78 శాతం పెరిగాయి, 2018 లో 11.37 లక్షల కోట్లు వసూళ్లు
 • సంవత్సరానికి కోటి కి పైగా నగదు ఉపసంహరణ చేస్తే 2 శాతం టిడీఎస్
 • దేశంలో 120 కోట్లమందికి ఆధార్ కార్డులున్నాయి
 • ఐటీ రిటర్న్ కి పాన్ కార్డు లేకుంటే ఆధార్ కార్డు చూపించవచ్చు
 • గృహ ఋణం తీసుకున్న వారికీ అదనంగా మరో లక్షన్నర వడ్డీ రాయితీ 
 • ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సహకాలు , మొదటిసారి 45 లక్షల గృహ ఋణం తో ఇల్లు కొంటే 3.5 లక్షల రాయితీ
 • ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టి ఐదు శాతం తగ్గింపు
 • ఐదు లక్షల వరకు ఆదాయ పన్ను లేదు
 • పన్నుల విధానం లో మార్పులు, కార్పొరేట్ టాక్స్ పరిధి 400కోట్లకు పెంపు
 • కొత్త నాణేలు ముద్రణ, 1, 2, 5,10, 20, రూపాయల కొత్త నాణేలు విడుదల చేస్తాం
 • ప్రభుత్వ రంగ సంస్థల నుండి లక్ష ఐదు వేలా కోట్లు ఉపసంహరణకు ప్రభుత్వ నిర్ణయం
 • ఎయిర్ ఇండియా లో పెట్టుబడులు ఉపసంహరణ
 • బ్యాంకింగ్ రంగ ప్రక్షాళణ, ఏడాది లో లక్ష కోట్ల మొండి బకాయిలు తగ్గించాం
 • మహిళా అభివృద్ధికి పథకాలు, 2019 ఎన్నికలలో మహిళలు అధికంగా పాల్గొన్నారు, 76 మంది ఎన్నికల్లో విజయం సాధించారు
 • పీపీపీ విధానంలో భారత్ మూడో స్థానం, అమెరికా , చైనా మొదటి రెండు స్థానాలు
 • ఆఫ్రికా దేశాల్లో 18 రాయబార కేంద్రాలు ఏర్పాటు
 • పీపీపీ విధానంలో భారత్ మూడో స్థానం, అమెరికా , చైనా మొదటి రెండు స్థానాలు
 • భారత్ పాస్ పోర్ట్ ఉంటే వెంటనే ఎన్ఆర్ఐ లకు వెంటనే ఆధార్ కార్డు
 • ఉజ్వల యోజన కింద 35 కోట్ల ఎల్ఈడీ బల్బుల పంపిణీ
 • 30 లక్షల మంది కార్మికులకు ప్రధానమంత్రి పెన్షన్ యోజన
 • గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కొరకు భారత్ నెట్ ఏర్పాటు
 • జాతీయ స్పోర్ట్స్ కమిషన్ ఏర్పాటు
 • ఖేల్ ఇండియా కి ఇక నుంచి మరింత ప్రోత్సహం, క్రీడలని అభివృద్ధి చేస్తాం
 • 30 విద్యాసంస్థలకు, ప్రపంచ టాప్- 200 విద్యాసంస్థలలో చోటు, మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం. స్టడీ ఇన్ ఇండియా ద్వారా విదేశీ విద్యార్థులకు అవకాశం
 • విద్యారంగం లో మార్పులు, సంస్కరణలు అమలు, నూతన విధానం ఏర్పాటు
 • మహాత్మా గాంధీ 150 వ జయంతి నాటికీ ఓడీఎఫ్ భారత్ గా మార్చడమే ప్రధాని లక్ష్యం
 • పీఎంఏవై కింద 81 లక్షల గృహాల నిర్మాణం
 • జీరో బడ్జెట్ వ్యవసాయం పై రైతులకు శిక్షణ
 • అన్ని నివాసాలకు 2022 కల్లా కరెంటు , గ్యాస్ సరఫరా
 • అందరికి ఇల్లు ఇచ్చే లక్ష్యంగా పని చేస్తాం, ఇంటి నిర్మాణ సమయం 114 రోజులకి తగ్గించాం, 1. 9 కోట్ల ఇంటి నిర్మాణము జరుగుతుంది
 • అంతరిక్ష విధానం లో భారత్ సరికొత్త శక్తి గా ఎదుగుతుంది
 • ప్రధానమంత్రి కర్మ యోగి మాన్ ధన్ యోజన – చిల్లర వర్తకులకు పింఛన్ పథకం
 • ఒకే కార్డు తో బస్సు చార్జీలు, పార్కింగ్ ఫీజు చెల్లించే విధానం తెస్తాం
 • పరిశ్రమలకు త్వరగా అనుమతులు వచ్చేలా చేస్తాం, మినిమం గవర్నమెంట్ మాక్సిమమ్ గవర్నెన్స్ మా విధానము
 • భారత్ మాల, సాగరమాల, ఉడాన్ లతో పట్టణ గ్రామాల మధ్య అంతరం తగ్గిస్తాం
 • సామాన్యులకు అద్దె ధరలు అందుబాటులోకి తెస్తాం
 • రైల్వేస్ లో 50 లక్షల కోట్ల పెట్టుబడితో ఘనమైన మార్పులు చేయవచ్చు అందుకే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం కోసం చూస్తున్నాం
 • ఈ ప్రభుత్వం జలమార్గం లో రవాణాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది
 • మెట్రో సర్వీసులు పెంచాం, ఇప్పటివరకు 657 కీ. మీ మెట్రో మార్గం ఉంది , మరో 300 కీ. మీ మెట్రో మార్గానికి అనుమతులు ఇచ్చాము
 • ప్రధానమంత్రి సడక్ యోజన, ఉడాన్, రవాణా సాగరమాల తో అనుసంధానం అవుతుంది
 • రిజిస్ట్రేషన్, పన్నుల వ్యవస్థలో మార్పులు తెచ్చాము, స్వచ్ఛ భారత్ తో అనేక మార్పులు తెచ్చాము
 • ఎన్డీఏ వచ్చేనాటికి 1.85 లక్షల డాలర్స్ ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు 2.5 లక్షల డాలర్స్ కు చేరుకుంది
 • 5 ట్రిలియన్ వైపు దూసుకెళ్తున్నాం
 • ఇండియా ఎకానమీ $1 ట్రిలియన్ చేరుకోవడానికి 55 సంవత్సరాలు పట్టింది కానీ ప్రజల నమ్మకంతో తరువాత మైలురాళ్ళు కొద్దికాలంలోనే సాధిస్తాం.
 • పనితీరు, సంస్కరణ, మార్పు సూత్రాలు బిజెపి పాటించింది. సరికొత్త ఇండియా బిజెపి తోనే సాధ్యం
 • నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టారు
 • లోక్‌సభ స్పీకర్ తన తొలి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆహ్వానించారు.
 • లోక్‌సభ ప్రారంభమైంది

ప్రజలు ఎంతో ఆశక్తి ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2019-20 మరి కాసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ ఇప్పటికే బడ్జెట్ ప్రతులతో ఆర్థికశాఖ కార్యాలయం నుండి బయలుదేరి వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలిసి బడ్జెట్ కాపీ అందజేశారు. మరికాసేపట్లో పార్లమెంట్ చేరుకొని ఉదయం 11 గంటలకి లోక్ సభ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

నరేంద్రమోదీ నాయకత్వం లో బిజెపి పార్టీ రెండోసారి ఘన విజయం సాధించింది, ఇప్పుడు దేశ ప్రజలంతా ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ ఎన్నికల హామీల నేపధ్యంలో బడ్జెట్ పై ఎటువంటి కసరత్తు చేసారు, ప్రజలకు ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారనే అంశాలపై చర్చించుకుంటున్నారు. ఈ సారి మోడీ ప్రభుత్వం సంక్షేమం పై దృష్టి సారించనున్నారు, పన్ను వసూళ్లు, జిఎస్టీ ఇతర విషయాలు పరిగణలోకి తీసుకొని, ప్రజల కిచ్చిన హామీల నేపథ్యంలో తాజా బడ్జెట్ ఉంటుందని ఆర్ధిక మంత్రి స్పష్టం చేసారు.

గత బడ్జెట్ లో పన్ను వసూలు కి పెట్టుకున్న అంచనాలను ప్రభుత్వం చేరుకోలేక పోయింది, ఆ లోటుని ఆర్బీఐ సహకారంతో దాటాలని ప్రభుత్వం యోచిస్తుంది. వృద్ధిరేటు, వడ్డీ రేట్లపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యవసాయ రంగం పై కేటాయింపులు, బ్యాంకింగ్ సంస్కరణలు కు పెద్ద పీట వెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. 2019- 20 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ లో పన్ను స్లాబు, గృహ రుణాలు, చిన్న సన్నకారు రంగాలకు ప్రోత్సహం, మహిళా భద్రత, ఇతర అనేక అంశాలపై ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దివంగత మాజీ మహిళా ప్రధాని ఇందిరా గాంధీ తరువాత, ఒక పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టే మహిళగా నిర్మల సీతారామన్ రికార్డ్ సాధించనున్నారు.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here