అమెరికాలో 6 లక్షలు దాటిన కరోనా మరణాలు

America Coronavirus, America Coronavirus Deaths, Coronavirus Cases, Coronavirus Crisis, Coronavirus Deaths In US, Coronavirus outbreak, Coronavirus Pandemic, COVID 19 Deaths, COVID 19 Deaths In US, Covid-19 Death Toll Crosses 6 Lakh in United States of America, Covid-19 Death Toll in United States of America, Mango News, US Coronavirus Deaths, US COVID 19 Deaths, USA

ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం అధికంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదైన దేశాల్లో అమెరికా మొదటిస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనాతో మరణించిన వారి మొత్తం సంఖ్య తాజాగా 6 లక్షలు (600,285 ) దాటింది. అలాగే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 3.34 కోట్లు (3,34,86,108) దాటింది.

కాగా అమెరికాలో పెద్దఎత్తున కరోనా వ్యాక్సినేషన్‌ చేపట్టడంతో గతకొన్ని నెలలుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. అమెరికాలో సగం జనాభా ఇప్పటికే ఒక డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కరోనాతో మరణించిన అమెరికన్లకు అధ్యక్షుడు జో బైడెన్ నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి వలన దేశం మరో భయంకరమైన మైలురాయిని దాటింది. 6,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని జో బైడెన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here