ఓయూ పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలకు నోటిఫికేషన్‌ విడుదల

Final Semester Exams 2021, Mango News, Osmania University, Osmania university announces UG, Osmania University PG Final Semester Exams, Osmania University PG Final Semester Exams to be held in July, Osmania University PG Final Semester Exams to be held in July First Week, OU Degree Time Table 2021, PG Final Semester Exams

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణ విషయంలో యూనివర్సిటీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) మంగళవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. క్యాంపస్, అనుబంధ, డిస్ట్రిక్ట్ పీజీ కాలేజీలలో పీజీ (ఎంఏ/ఎంకామ్/ఎంకామ్(ఐఎస్)/ఎంఎస్డబ్ల్యు/ ఎంఎస్సీ/ఎం.లిబ్.ఐ.ఎస్సీ/ఎంజే అండ్ ఎంసీ…) కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను జూలై మొదటి వారంలో నిర్వహించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెల్లడించారు. ఈ పరీక్షల కోసం జూన్ 22 తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఇక రూ.300 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించునేందుకు ఆఖరు తేదీని జూన్ 28 గా నిర్ణయించారు. ఈ పరీక్షల నోటిఫికేషన్ వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here