యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు నెగటివ్ వచ్చిన 7 రోజుల ఇన్‌స్టిట్యూష‌న‌ల్ క్వారంటైన్

Air India resumes booking for flights, Arvind Kejriwal Announces New Rules For UK Returnees, Delhi CM Arvind Kejriwal, Flights between UK and India, India Lifts Ban on UK Flights, India Resumes Flights Services, India Resumes Flights Services From UK, India UK flight services to resume, India UK flights, India-UK air travel to resume, India-UK flights to resume, International Flights, Mango News, New Rules For UK Returnees, UK-India Flights To Resume

యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లో కొత్తరకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకే నుంచి భారత్ కు మళ్ళీ విమానరాకపోకలు ప్రారంభమవడం చర్చనీయాంశమవుతుంది. గురువారం ఉదయం 246 మంది ప్రయాణికులతో ఎయిరిండియా విమానం యూకే నుంచి ఢిల్లీ చేరుకుంది. ఈ క్రమంలో యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. “ఢిల్లీ ప్రజలు యూకే కొత్తరకం వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకుంది. యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల్లో పాజిటివ్ గా పరీక్షించబడిన వారు ఐసోలేషన్ సదుపాయంలో ఉంచబడతారు. అలాగే నెగెటివ్ వ‌చ్చినవారు కూడా తప్పనిసరిగా ఏడు రోజుల ఇన్‌స్టిట్యూష‌న‌ల్ క్వారంటైన్ లో ఉండాలి. ఆ త‌ర్వాత మ‌రో ఏడు రోజులు పాటుగా హోమ్ క్వారంటైన్ లో ఉండాలి” అని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ముందుగా యూకేలో కొత్తరకం కరోనా‌ వెలుగులోకి రావడంతో అక్కడి నుంచి వచ్చే మరియు వెళ్లే విమానాలపై భారత్ కొన్ని రోజులు తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అనంతరం కరోనా నియంత్రణ నియమాలతో జనవరి 6 నుండి యూకే నుంచి విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. జనవరి 23 తేదీవరకు భారత్‌ నుంచి యూకే కి 15, యూకే నుంచి భారత్ కు 15 చొప్పున వారానికి మొత్తం 30 విమానాలు నడపనున్నట్టు కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ ఇటీవలే వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =