ఏసీల దిగుమతిపై నిషేధం విధించిన కేంద్రం

AC Import Ban, Centre has Banned Import Policy of Air Conditioners, Centre Imposes Ban on Import of Air Conditioners, Govt bans import of air conditioners with refrigerants, import of air conditioners banned in India, Import of air conditioners with refrigerants banned, Import Policy of Air Conditioners, India Bans Import Of Air Conditioners

దేశంలో వస్తువుల దిగుమతికి సంబంధించి కేంద్రప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తాజాగా ఎయిర్ కండీషనర్ల (ఏసీ) దిగుమతిపై నిషేధం విధిస్తునట్టు ప్రకటించారు. “స్ప్లిట్ సిస్టం మరియు ఇతర రకాలకు సంబంధించి రిఫ్రిజిరెంట్లతో కూడిన ఎయిర్ కండీషనర్ల దిగుమతి విధానం నిషేధించబడింది” అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్టి) ఒక ప్రకటన విడుదల చేసింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ లో భాగంగా స్వదేశీ తయారీ విధానానికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీల విషయంలో దేశీయ తయారీ విధానాన్ని బలోపేతం చేసే దిశగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే టైర్లు, కలర్ టీవీలు సహా పలు వస్తువుల దిగుమతిపై కేంద్రం నిషేధం విధించగా, ఈ జాబితాలోకి ఏసీలు కూడా చేరాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =