31 వ రోజుకు చేరిన రైతుల ఆందోళన: డిసెంబర్ 29 న కేంద్రంతో చర్చలు

Farmers Protest Enters into 31st day, Farmer Unions Decide to Attend Talks With Centre on Dec 29,Farmers Protest Enters 31st Day Against Farm Bills,Farmers Protest,Delhi Farmers Protest,Farmers Protest Enters 31st Day,Farmers Protest,Farm Laws,Agriculture,Punjab Farmers,Farmers Union,Farmers Meeting,PM Modi,Farmer Protest,Punjab Farmer Protest,Delhi Chalo Protest,Farmers Protest Video,Farmers Protest Live,Farmers Protest To Delhi,Delhi Farmers Protest,Punjab Farmer Protest Live News,Farmers Protest In Delhi,Farmers Protest In Punjab,Farmer Protest In Haryana,Farmer Protest Today,Farmer Protest Latest News,Farmers Protest Day 31,Farmers Protest Today,Mango News,Mango News Telugu

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 31 వ రోజుకు చేరుకుంది. గతకొన్ని రోజులుగా కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చర్చలకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రైతు సంఘాల సభ్యులు సమావేశమై కేంద్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలు, చర్చలకు సంబంధించిన లేఖపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 29, మంగళవారం ఉదయం 11 గంటలకు కేంద్రంతో తదుపరి రౌండ్ చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

ముఖ్యంగా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులు, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కు చట్టబద్ధమైన హామీ, రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ముసాయిదా విద్యుత్ సవరణ బిల్లు-2020 లో మార్పులు, రైతులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణ వంటి అంశాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, వీటి ఆధారంగా మంగళవారం నాడు కేంద్రం చర్చలు నిర్వహించాలని కోరారు. ఇంతకుముందు జరిగిన చర్చల్లో వాస్తవాలను వక్రీకరించవద్దని రైతు సంఘాలు కేంద్రాన్ని కోరాయి. మూడు చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌ను వారు మరోసారి పునరుద్ఘాటించారు. మరోవైపు డిసెంబర్ 30 న సింఘా సరిహద్దు నుండి కుండ్లి-మానేసర్-పాల్వాల్ రహదారిపై ట్రాక్టర్ మార్చ్ నిర్వహించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − four =