ఫ్రెంచ్‌ ఓపెన్‌: మహిళల సింగిల్స్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న పోలాండ్‌ స్టార్ ప్లేయర్ ‘ఇగా స్వియాటెక్‌’

French Open 2022 Iga Swiatek Beats Gauff To Win Second French Open Title, Iga Swiatek Beats Gauff To Win Second French Open Title, Second French Open Title, French Open 2022, 2022 French Open, French Open, Iga Swiatek, Gauff, Iga Swiatek Beats Gauff, French Open Title, French Open Title News, French Open Title Latest News, French Open Title Latest Updates, French Open Title Live Updates, Mango News, Mango News Telugu,

ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్‌ ఓపెన్‌-2022 లో మహిళల సింగిల్స్‌లో పోలాండ్‌ స్టార్ ప్లేయర్ ‘ఇగా స్వియాటెక్‌’ విజేతగా నిలిచింది. గంటా ఎనిమిది నిమిషాల పాటు సాగిన ఈ టైటిల్‌ పోరులో 18 ఏళ్ల అమెరికా యువ సంచలనం కోకో గాఫ్‌పై సంచలన విజయం సాధించింది. తొలి రౌండ్ నుంచే పూర్తి ఆధిపత్యం చూపించిన స్వియాటెక్‌ ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చాంపియన్‌ తరహా ఆటతీరును ప్రదర్శించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో 6-1, 6-3 స్కోరుతో వరుస సెట్లను గెలుచుకుని సగర్వంగా రెండవసారి రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుచుకుంది. మ్యాచ్‌ మొత్తంలో స్వియాటెక్‌ 18 విన్నర్లు సంధించగా.. గాఫ్‌ 14కు పరిమితమైంది.

అయితే గతంలోనే 2020 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన స్వియాటెక్‌.. గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన తొలి పోలాండ్‌ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతున్న ఇగా స్వియాటెక్‌కు ఇది వరుసగా 35వ విజయం కావడం విశేషం. గత 34 మ్యాచ్‌ల్లో ఓటమి అనేదే లేకుండా ఫైనల్లో అడుగుపెట్టిన స్వియాటెక్‌ ఫైనల్లోనూ తన జోరు చూపించింది. ఈ సందర్భంగా బహుమతి ప్రదానోత్సవంలో పట్టరాని సంతోషంతో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. ఇక కెరీర్ లో తొలిసారి మేజర్‌ టోర్నీ ఫైనల్‌ ఆడిన గాఫ్‌ మ్యాచ్‌ అనంతరం తన మాటతీరుతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. మరోవైపు నేడు జరుగనున్న పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో రఫెల్ నాదల్‌తో కాస్పర్‌ రూడ్‌ తలపడనున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =