మహిళల ఆసియా కప్ 2022: తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. రాణించిన జెమీమా, హేమలత

Women's Asia Cup 2022 Jemimah and Hemalatha Plays Key Role To Win India's First Match Against Sri Lanka, Women's Asia Cup 2022, India Beat Sri Lanka In The First Match, Jemima And Hemalatha Excelled, Mango News, Mango News Telugu, Women Asia Cup 2022, Women Asia Cup Highlights, Ind Vs Srilanka Asia Cup 2022, Ind Vs Srilanka Asia Cup , Ind Vs Srilanka Womens Asia Cup, India Beat Sri Lanka, Ind Vs Srilanka Womens First Match, Ind Vs Srilanka Women Asia Cup, Women Asia Cup Latest News And Live Updates, Ind Vs Srilanka Womens Cup News And Updates, Ind Vs Srilanka Womens Cup

మహిళల ఆసియా కప్‌లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్‌పై సిరీస్‌ విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు ఈ మ్యాచ్ లోనూ అదే జోరుని కొనసాగించింది. శనివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 53 బంతుల్లో 76 పరుగులు చేసి భారత్ చెప్పుకోదగ్గ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. లంక బౌలర్లలో రణసింగ్ 3/32 సత్తా చాటింది. అనంతరం ఛేదనలో లంక 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది. హాసిని పెరీరా 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత బౌలర్లలో దయాళన్ హేమలత (3/15), పూజా వస్త్రాకర్ (2/12), దీప్తి శర్మ (2/15), రాధా యాదవ్ (1/15) లంక వెన్ను విరిచారు. భారత్ తన తదుపరి మ్యాచ్ అక్టోబర్ 7న పాకిస్థాన్‌తో ఆడనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − seven =