ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2021 లో రోహిత్ శర్మ, అశ్విన్, రిషబ్ పంత్ లకు చోటు

Babar Azam named captain of ICC Men’s ODI Team of Year 2021, ICC announce Men’s ODI team of the year 2021, ICC Announced Test, ICC Announced Test ODI T20 Teams for the Year of 2021, ICC Announced Test Team, Kane Williamson Named Captain As ICC Announces Test Team Of The Year 2021, Mango News, No Indian In Babar Azam-Led ICC Men’s T20 Team, ODI, T20 Teams for the Year of 2021, Virat Kohli, Virat kohli did not find a place in all 3 icc teams test odi

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం నాడు పురుషుల టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2021, వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2021 ను ప్రకటించింది. కాగా టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ లో భారత్ జట్టు నుంచి స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, యువ ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నారు. అయితే ఈ జట్టులో భారత్ మాజీ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవడం గమనార్హం. టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2021 కు కెప్టెన్ గా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియంసన్ ను ఐసీసీ ప్రకటించింది.

ఇక వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2021 లో ఒక్క భారత క్రికెటర్ కు కూడా చోటు దక్కలేదు. వన్డే జట్టుకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. అలాగే బుధవారం ప్రకటించిన టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2021లో కూడా భారత్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. టీ20 జట్టుకు కూడా బాబర్ ఆజమ్ యే కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ప్రపంచ క్రికెట్ లో కీలక జట్టుగా ఉన్న భారత్ నుంచి, ఐసీసీ ప్రకటించిన వన్డే, టీ20 జట్లలో చోటు దక్కకపోవడంతో క్రీడాభిమానులు నిరాశ చెందారు.

ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2021: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), దిముత్ కరుణరత్నే, రోహిత్ శర్మ, మార్నస్ లబూషేన్, జో రూట్, ఫవాద్ ఆలం, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, కైల్ జెమీసన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది.

ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2021: బాబర్ ఆజమ్ (కెప్టెన్), పాల్ స్టిర్లింగ్, జేన్మన్ మలన్, ఫకర్ జమాన్, రస్సీ వన్ డర్ డసెన్, షకీబ్ ఉల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్ (వికెట్ కీపర్), వనిందు హసరంగ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సిమి సింగ్, దుష్మంత చమీర.

ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2021: బాబర్ ఆజమ్ (కెప్టెన్), జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్, ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, డేవిడ్ మిల్లర్, తబ్రైజ్ షమ్సీ, జోష్ హేజిల్‌వుడ్, వనిదు హసరంగా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షాహీన్ అఫ్రిది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here