ఆస్ట్రేలియాతో వన్డే పోరుకు భారత్ సిద్ధం, నేడే తోలి వన్డే మ్యాచ్

India vs Australia ODI Series: First ODI Match Today at Mumbai Wankhede Stadium From 1.30 PM,India vs Australia ODI Series,First ODI Match Today at Mumbai,ODI Series at Wankhede Stadium From 1.30 PM,India vs Australia Match Today,Mango News,Mango News Telugu,IND VS AUS Live Updates,1st ODI Cricket Match Live Score,IND vs AUS Weather Report Live Today,First ODI between India and Australia,India vs Australia 1st ODI Live Score,IND vs AUS 1st ODI Preview,Mumbai Wankhede Stadium Live Updates,India vs Australia Latest News and Updates,India vs Australia Live News

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 17, 19, 22 తేదీల్లో 3 వన్డేల సిరీస్ జరగనుంది. అందులో భాగంగా ఈ రోజు (మార్చి 17, శుక్రవారం) ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి తోలి వన్డే మ్యాచ్ జరగనుంది. కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టుల సిరీస్ ను భారత్ జట్టు 2-1 తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ లోనైనా పైచేయి సాధించాలని ఆస్ట్రేలియా భావిస్తుండగా, మరోసారి మెరుగైన ప్రదర్శన చేసి వన్డేల్లో కూడా సత్తా చాటాలని భారత్ జట్టు సిద్ధమైంది. ఫ్యామిలీ రీజన్స్ తో రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తోలి వన్డే మ్యాచ్‌కు దూరం కావడంతో భారత్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, మూడోస్థానంలో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సూర్యకుమార్‌, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మెరుగ్గా రాణించడంపైనే ప్రధానంగా భారత్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

రవీంద్ర జడేజా వన్డే జట్టులోకి రావడం, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లతో భారత్ బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా మారింది. ఇక ఆస్ట్రేలియా జట్టు విషయానికొస్తే కెప్టెన్‌ పాట్ కమిన్స్‌ వన్డే సిరీస్ కు కూడా స్టీవెన్ స్మిత్ ఆ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. బ్యాటింగ్ విభాగంలో డేవిడ్ వార్నర్‌, ట్రావిస్ హెడ్‌, స్మిత్‌, మార్కస్ లబుషేన్‌, మార్కస్ స్టోనిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ మరియు బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్క్‌, కామెరూన్ గ్రీన్‌, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్ లతో ఆసీస్ జట్టు బలంగా ఉంది. వాంఖడే పిచ్‌ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఇక వన్డేల్లో ఇరు జట్లు ప్రభావశీలంగా ఉండడంతో ఈ సిరీస్‌ హోరాహోరీగానే సాగనుంది.

భారత్ (తుది జట్టు అంచనా): శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/రజత్ పాటిదార్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్/కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ.

ఆస్ట్రేలియా (తుది జట్టు అంచనా): డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్‌, మిచెల్ మార్ష్/మార్కస్ స్టోనిస్, గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =