ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్: రెండోరోజు భారత్ 294-7, రిషభ్‌ పంత్ సెంచరీ

Highlights India vs England 4th Test, IND vs ENG 4th Test Day 2 highlights, India 294-7 Rishabh Pant Hits Century, India vs England, India Vs England 4th Test, India Vs England 4th Test Day 2, India Vs England 4th Test Day 2 Stumps, India vs England 4th Test News, India vs England Live Cricket Score 4th Test, India vs England Live Cricket Score 4th Test Day 2, India vs England Match, India vs England Match updates, Mango News

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్ వీరోచిత సెంచరీతో భారత్ కు ఆధిక్యం లభించింది. రెండో ఆటలో భారత్ బ్యాట్స్ మెన్ వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టినప్పటికీ రిషభ్ పంత్, బ్యాటింగ్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రిషభ్ పంత్ 115 బంతుల్లో 13 ఫోర్స్, 2 సిక్స్ ల సహాయంతో టెస్టుల్లో తన మూడో సెంచరీని నమోదు చేశాడు. సెంచరీ అనంతరమే అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో రూట్ కి క్యాచ్ ఇచ్చిన రిషభ్ పంత్ 101 ప‌రుగుల వద్ద అవుట్ అయ్యాడు.

ముందుగా 24/1 వద్ద రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్ జట్టు 40 పరుగుల వద్ద చటేశ్వర్ పుజారా, 41 పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ టెస్టుల్లో ఎనిమిదో సారి డకౌట్ గా వెనుదిరిగాడు. ‌ఈ క్రమంలో రోహిత్ శర్మ (49), అజింక్య రహానే (27 ) పరుగులతో రాణించారు. రహానే అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ ఇంగ్లాండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. 82 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రిషబ్ పంత్, అనంతరం 33 బంతుల్లోనే శతకానికి చేరుకున్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 113 పరుగులు జోడించాడు. రెండో అట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 89 పరుగుల ఆధిక్యం లభించగా, వాషింగ్టన్ సుందర్ (60), అక్షర్ పటేల్ (11) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 3, బెన్ స్టోక్స్ 2, జాక్ లీచ్ 2 వికెట్లు పడగొట్టారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =