బీహార్: అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గిన సీఎం నితీష్‌ కుమార్‌, ఓటింగ్‌ను బహిష్కరించిన బీజేపీ

CM Nitish Kumar Led Grand Alliance Wins Floor Test in Bihar Assembly as BJP Stages Walkout, Bihar Assembly Floor Test, CM Nitish Kumar Wins Bihar Assembly Floor Test, CM Nitish Kumar Led Grand Alliance Wins Floor Test, Bihar Assembly, Floor Test, BJP Stages Walkout, Bihar CM Nitish Kumar, Nitish Kumar Wins Floor Test, Bihar Assembly Floor Test News, Bihar Assembly Floor Test Latest News And Updates, Bihar Assembly Floor Test Live Updates, Mango News, Mango News Telugu,

బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అధినేత నితీష్ కుమార్ బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)తో తెగతెంపులు చేసుకుని మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి)తో చేతులు కలిపి మహాఘట్‌బంధన్‌ను ఏర్పాటు చేసి తిరిగి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బీహార్ అసెంబ్లీలో సీఎం నితీష్‌ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి విజయం సాధించింది. బుధవారం జరిగిన బలపరీక్షలో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం ఏకగ్రీవంగా నెగ్గింది. సభ నుంచి బీజేపీ వాకౌట్‌ చేసిన క్రమంలో ఆయనకు అనుకూలంగా 160 ఓట్లు పడగా వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు.

ఈ సందర్భంగా అసెం‍బ్లీలో సీఎం నితీష్‌ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో మంచి వాళ్లకు చోటు లేదని, వాజ్‌పేయి, అద్వానీలే తన మాట వినేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు బీజేపీలో లేవని వ్యాఖ్యనించారు. కాగా శాసనసభ సమావేశాలు ముందుగా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హాజరై సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ అసెంబ్లీలో విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ప్రసంగించారు. ఇదిలా ఉండగా బలపరీక్షకు ముందు, అధికార సంకీర్ణ ఎమ్మెల్యేలు తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో బిజెపికి చెందిన విజయ్ కుమార్ సిన్హా అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + eighteen =