నేడు వెస్టిండీస్ తో తొలి వన్డే.. 1000వ వన్డే మ్యాచ్‌ ఆడనున్న భారత్

2022, 3 ODI Series, IND v WI 2022, ind vs wi, India marks 1000th ODI, india vs west indies, India vs West Indies 1st ODI Highlights, India vs West Indies 1st ODI LIVE score and Updates, India vs WI, India vs WI 1st ODI, India vs WI 1st ODI 2022, India vs WI 1st ODI 2022 India, India vs WI 1st ODI 2022 India To Play 1000th ODI in Ahmedabad Narendra Modi Stadium Today, Mango News, ODI in Ahmedabad Narendra Modi Stadium, West Indies in India

నేటినుంచి ఇండియా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్‌ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఈరోజు (ఆదివారం) జరగనున్న తొలి వన్డే టీమిండియాకు 1000వ వన్డే మ్యాచ్‌ కావడం విశేషం. ఈ వన్డే సిరీస్‌ ద్వారా రోహిత్‌ శర్మ తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో ఎదురైన పరాభవం నేపథ్యంలో.. స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్ లో ఎలాగైనా గెలవాలని టీమిండియా ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ గెలుచుకుని మంచి ఉత్సాహంతో వెస్టిండీస్‌ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ గెలిచి వన్డే సిరీస్‌లో శుభారంభం చేయాలని కరీబియన్‌ జట్టు ఉత్సాహపడుతోంది. అయితే, వ్యక్తిగత కారణాలతో.. కేఎల్‌ రాహుల్, కరోనాతో.. ధావన్, శ్రేయస్, రుతురాజ్, సైనీలు ఇప్పటికే ఈ మ్యాచ్ కు దూరమయ్యారు. మరో ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ క్వారంటైన్‌ ఇంకా పూర్తి కాలేదు.

దీంతో.. భారత్‌ ఓపెనింగ్‌కు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఇషాన్‌ కిషన్‌ ఒక్కడే. కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. కాగా, టీమిండియా 1000వ వన్డే మ్యాచ్‌ ఆడనున్న నేపథ్యంలో.. భారత లెంజెండ్ సచిన్ టెండూల్కర్ ఈ సందర్భంగా జట్టు ఆటగాళ్లను, భారత క్రికెట్ నిర్వాహకులను అభినందించాడు. ఈ మైలురాయికి చేరుకునే క్రమంలో భారత జట్టు ఎన్నో గొప్ప విజయాలను అందుకుంది సచిన్ తెలిపాడు. అలాగే, ఈ మ్యాచ్ కూడా గెలిచి దీన్ని మరిచిపోలేని మధుర స్మృతిగా అభిమానులకు ఇవ్వాలని టీమిండియాకు సూచించాడు సచిన్. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌-1లో ప్రసారం కానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − three =