94.5 శాతం సమర్ధంగా పనిచేస్తున్న మోడెర్నా కరోనా వ్యాక్సిన్

coronavirus vaccine, Coronavirus Vaccine News, Coronavirus Vaccine Updates, COVID-19 vaccine is 94.5% effective, Mango News Telugu, Moderna Announces its Covid-19 Vaccine Found 94.5% effective, Moderna coronavirus vaccine, Moderna COVID-19 vaccine, Moderna reports its COVID-19 vaccine is 94.5% effective, Moderna says its vaccine is 94.5% effective, Moderna vaccine found 94.5% effective

ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడంలో నిమగ్నమైన సంగతి తెలిసిందే. వివిధ కరోనా వ్యాక్సిన్ లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించి మరో శుభవార్త అందింది. అమెరికాకు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా రూపొందించిన mRNA-1273 వ్యాక్సిన్ కరోనాను నివారించడంలో 94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఈ వ్యాక్సిన్ పై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన డేటా సేఫ్టీ మానీటరింగ్‌ బోర్డ్‌(డీఎస్‌ఎంబీ) ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా మోడెర్నా సంస్థ ప్రకటించింది.

అమెరికా ఆరోగ్య మరియు మానవ సేవల విభాగం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్(ఎన్ఐఏఐడి), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ ఐహెఛ్) మరియు బయోమెడికల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బిఏఆర్డిఏ) నేతృత్వంలో మోడెర్నా సంస్థ “కోవ్” పేరుతో ఈ కరోనా వ్యాక్సిన్ పై అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనంలో అమెరికాలో దాదాపు 30000 మంది వాలంటీర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్టు తెలిపారు. ఫలితాల విశ్లేషణ అనంతరం వ్యాక్సిన్ 94.5శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు వెల్లడయిందని పేర్కొన్నారు. మరోవైపు ఇటీవలే ఫైజర్ సంస్థ కూడా తమ కరోనా వ్యాక్సిన్ 90 శాతం పైగా సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =