నవోదయ ప్రవేశపరీక్షకు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ ప్రారంభం, ఆగస్టు 11న పరీక్ష నిర్వహణ

JNVST 2021, Mango News, Navodaya Class 6 Entrance Test, Navodaya Class 6 Entrance Test to be Held, Navodaya Class 6 Entrance Test to be Held on August 11th, Navodaya Class 6 Entrance Test to be Held on August 11th Hall Ticket Download Starts, Navodaya Exam Date, Navodaya Exam Date 2021, Navodaya Vidyalaya announces Class 6 Exam Date, Navodaya Vidyalaya entrance test, Navodaya Vidyalaya entrance test admit card

జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి జవహర్‌ నవోదయ విద్యాలయ సెలెక్షన్‌ టెస్టు(జేఎన్‌వీఎస్‌టీ)ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి గాను జేఎన్‌వీఎస్‌టీ-2021 ప్రవేశ పరీక్షను అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఆగస్టు 11వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. అన్ని భద్రతా జాగ్రత్తలు, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. మొత్తం 47,320 మంది విద్యార్థుల ఎంపిక కోసం 11,182 కేంద్రాల్లోపరీక్ష నిర్వహించబడుతుందని, ఈ ఎంపిక పరీక్షకు 2,41,7009 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు.

రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు అడ్మిట్ కార్డులు/హాల్ టికెట్స్ ను సవరించిన పరీక్ష తేదీతో జూలై 23వ తేదీ నుండి నవోదయ అధికారిక వెబ్ సైట్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. జేఎన్‌వీఎస్‌టీ-2021 పరీక్షను ఇంగ్లీష్, హిందీ మరియు ఆయా రాష్ట్రాల యొక్క ప్రాంతీయ భాషలలో నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో ఈ పరీక్ష ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ముందుగా ఈ పరీక్షను మే16న, తర్వాత జూలై 19న నిర్వహించాల్సి ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా ఆగస్టు 11వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + thirteen =