ఉజ్బెకిస్థాన్ చేరుకున్న ప్రధాని మోదీ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ కు హాజరు

PM Modi to Attend Shanghai Cooperation Organization Summit Today at Samarkand Uzbekistan, PM Modi To Attend SCO Summit, PM Modi at Samarkand Uzbekistan, PM Modi Uzbekistan Tour, SCO Summit, Shanghai Cooperation Organization Summit, Shanghai Cooperation Organization, Mango News, Mango News Telugu, Samarkand Uzbekistan, PM Modi Samarkand Tour, SCO, SCO Uzbekistan, PM Narendra Modi , Indian PM Narendra Modi, PM Narendra Modi Latest News And Updates

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఉజ్బెకిస్తాన్‌ లోని సమర్‌కండ్ చేరుకున్నారు. ఉజ్బెకిస్థాన్ ప్రెసిడెంట్ షావ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌ లో సెప్టెంబర్ 16, శనివారం జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ 22వ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. సమర్‌కండ్ చేరుకున్న ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ ప్రధాన మంత్రి అబ్దుల్లా అరిపోవ్, పలువురు మంత్రులు, సమర్‌కండ్ ప్రాంత గవర్నర్ మరియు ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఇతర సీనియర్ అధికారులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.

ప్రధాని మోదీ శనివారం ఎస్‌సీఓ సమ్మిట్‌లో పాల్గొంటారు, అలాగే ఉజ్బెకిస్థాన్ ప్రెసిడెంట్ మరియు సమ్మిట్‌కు హాజరవుతున్న మరికొందరు నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. మరోవైపు ఎస్‌సీఓలో ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యా, ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌, తజికిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌ సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ వంటి నేతలు కలుసుకోవడంతో పాటుగా వారి మధ్య ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here