టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ సంచలన నిర్ణయం.. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు రిటైర్మెంట్‌

Tennis Legend Roger Federer Announces Retirement After The Laver Cup in London Next Week, Roger Federer Announces Retirement , Laver Cup in London, Tennis Legend Roger Federer , Laver Cup, Laver Cup 2022, Mango News, Mango News Telugu, Roger Federer Retirement From Tennis, Tennis Legend Roger Federer Retirement, Roger Federer Retirement, Roger Federer 20 Grand Slams Winner, Grand Slam Winner, Men's Grand Slam Title Winner, Roger Federer Retirement After Laver Cup, Roger Federer Twitter Live Updates, Roger Federer News And Live Updates

టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటన చేశాడు. మరో వారంలో లండన్‌లో జరగనున్న లావెర్ కప్ తర్వాత టెన్నిస్‌ నుంచి రిటైర్ అవుతున్నట్లు స్పష్టం చేశాడు. అయితే గత కొంతకాలంగా మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న ఫెదరర్ ఈ నెల 23 నుంచి మొదలు కానున్న లావెర్‌ కప్‌ తన ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు చివరిదని తేల్చి చెప్పాడు. తన అద్భుతమైన ఆటతీరుతో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న స్విస్ దిగ్గజం, ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌, 103 ఏటీపీ టూర్‌ టైటిల్స్‌, ఇంకా రెండు ఒలింపిక్‌ పతకాలు గెలుచుకున్నాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ డబుల్స్‌లో స్వర్ణం, 2012 లండన్‌ ఒలింపిక్స్‌ సింగిల్స్‌లో రజతం కైవసం చేసుకున్నాడు ఫెదరర్‌.

ఈ క్రమంలో ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. తాను సాధించిన 20 గ్రాండ్‌ స్లామ్‌లలో వింబుల్డన్ 8, ఆస్ట్రేలియన్ ఓపెన్ 6, యూఎస్ ఓపెన్ 5, ఫ్రెంచ్ ఓపెన్ 1 చొప్పున సాధించాడు. తన కెరీర్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన ఫెదరర్, టెన్నిస్‌ తనకు చాలా ఇచ్చిందని, ప్రపంచంలో తనంత అదృష్టవంతుడు మరొకరు లేరని అన్నాడు. కాగా 1998లో టీనేజ్ వయస్సులో ప్రొఫెషనల్‌ కెరీర్‌ ప్రారంభించిన స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెదరర్ 41 ఏళ్ల వయసులో 24 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై చెప్పడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానులని తీవ్ర నిరాశకు గురిచేసింది. వ్యక్తిగత జీవితంలో ఫెదరర్ మరింత సంతోషంగా ఉండాలని కోట్లాదిమంది అభిమానులతో పాటు, అతని సహచరులు కూడా ఆకాంక్షించారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రోజర్ ఫెదరర్‌కు ఉన్న అభిమానుల్లో సామాన్యులే కాకుండా పలు దేశాధినేతలు సైతం ఉండటం గమనార్హం. ఇక ప్రస్తుత ప్రపంచ టెన్నిస్‌లో మేటి ఆటగాళ్లు రఫెల్‌ నాదల్‌, నొవాక్‌ జొకోవిచ్‌లు సైతం తమకన్నా రోజర్ ఫెదరర్‌ గ్రేట్ అని బాహాటంగా పలుసార్లు కితాబివ్వడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =