కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన, ఐఐఎస్‌సీలో సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ ప్రారంభం

PM Modi Karnataka Tour Inaugurates Centre for Brain Research at IISC Bangalore, Narendra Modi inaugurates Centre for Brain Research at IISC Bengaluru, PM Narendra Modi Launches Centre for Brain Research at IISC Bengaluru, PM Modi Starts Centre for Brain Research at IISC Bengaluru, PM Modi Karnataka Tour, Modi Karnataka Tour, PM Narendra Modi Karnataka Tour, PM Modi Inaugurates Centre for Brain Research at IISC Bangalore, Centre for Brain Research at IISC Bangalore, IISC Bangalore, Centre for Brain Research, PM Modi lay foundation stone of 800-bed hospital in Bengaluru today, 800-bed hospital in Bengaluru, PM Modi Karnataka Tour News, PM Modi Karnataka Tour Latest News, PM Modi Karnataka Tour Latest Updates, PM Modi Karnataka Tour Live Updates, Mango News, Mango News Telugu,

ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల (జూన్ 20, 21) పర్యటనలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా జూన్ 20, సోమవారం మధ్యాహ్నం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)ను ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ (సీబీఆర్)ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే బాగ్చి-పార్థసారథి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ కు శంకుస్థాపన చేశారు.

ఐఐఎస్‌సీ బెంగళూరులో సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఈ ప్రాజెక్టుకు గతంలో శంకుస్థాపన చేసిన ఘనత కూడా తనకు దక్కినందుకు ఇంకా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. మెదడు సంబంధిత రుగ్మతలను ఎలా నిర్వహించాలనే దానిపై పరిశోధనలో ఈ కేంద్రం ముందంజలో ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ప్రతి దేశం ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన తరుణంలో, బాగ్చి పార్థసారథి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వంటి ప్రయత్నాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నారు. రాబోయే కాలంలో ఇది హెల్త్ కేర్ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని మరియు ఈ రంగంలో మార్గదర్శక పరిశోధనలను ప్రోత్సహిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

అనంతరం ప్రధాని మోదీ బెంగళూరులోని కొమ్మఘట్టకు చేరుకుని, అక్కడ రూ.27000 కోట్ల విలువైన పలు రైలు మరియు రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సాయంత్రం 5.30 గంటలకు మైసూరులోని మహారాజాస్ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అక్కడ నాగనహళ్లి రైల్వే స్టేషన్‌లో కోచింగ్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (ఏఐఐఎస్‌హెచ్)లో “కమ్యూనికేషన్ డిజార్డర్స్ ఉన్న వ్యక్తుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్” ని జాతికి అంకితం చేయనున్నారు. రాత్రి 7 గంటలకు మైసూరులోని శ్రీ సుత్తూరు మఠాన్ని, ఆతరువాత మైసూరులోని శ్రీ చాముండేశ్వరి ఆలయాన్ని ప్రధాని సందర్శిస్తారు. మరోవైపు రెండో రోజు పర్యటనలో భాగంగా జూన్ 21, మంగళవారం ఉదయం 06:30 గంటలకు 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మైసూర్ ప్యాలెస్ మైదానంలో జరిగే సామూహిక యోగా ప్రదర్శనలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + one =